
లారీ బోల్తా
గుమ్మలక్ష్మీపురం: విశాఖపట్నం నుంచి పశ్చిమ బెంగాల్‌కు హైడ్రో క్లోరైడ్ ఆమ్లం(రసాయం)తో ఒడిశా వైపు నుంచి వెళ్లేందుకు వస్తున్న లారీ శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం పి ఆమిటి జంక్షన్ సమీంలోని ప్రధాన రహదారి పక్కనే అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ట్యాంకు నుంచి ఆ రసాయనం లీక్ కాకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో కొద్దిపాటి గాయాలతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎల్విన్‌పేట ఎస్‌ఐ బి.శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. బోల్తా పడిన లారీలో రసాయనం ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా వాహనదారులు స్థానికులు జాగ్రత్తలు తీసుకున్నారు.