
మన్యంలో కిలో అల్లం రూ.40
● సీతంపేట ఏజెన్సీలో భారీగా దిగుబడి
● పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.100 వరకు విక్రయం
సీతంపేట:
ఏజెన్సీ ప్రాంత రైతులు సుమారు 100 ఎకరాల కొండపోడులో సాగుచేసిన అల్లంపంట చేతికొచ్చింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి పంటను చౌకగా కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.100 నుంచి రూ.150వరకు ధర పలుకుతుండగా, గిరిజనుల నుంచి కిలో రూ.35 నుంచి రూ.40కే కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కిలో వద్ద సగానికి సగం లాభం ఆర్జిస్తున్నారు. సీతంపేట మండలంలోని రంగంవలస, ఎగువ, దిగువ ద్వారబంధం, పుట్టిగాం, తుంబలిగూడ తదితర ప్రాంతాల్లో అల్లం సీజన్ ఆరంభమైంది. అయితే, ధర లేకపోవడంతో గిరిజన రైతులు దిగాలుపడుతున్నారు.
ఈ ఏడాది అల్లం పంట కలిసి వచ్చింది. దిగుబడి బాగుంది. ప్రస్తుతానికి గ్రామాల్లోనే విక్రయిస్తున్నాం. ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో పంటను తవ్వేందుకు వెనుకంజవేస్తున్నాం.
– ఆనంద్, కలువరాయి, సీతంపేట మండలం
ప్రభుత్వ పరంగా అల్లంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలి. పైనాపిల్ వంటి పంటల్లో నష్టాలు చవి చూశాం. అల్లం పంటలో మంచి ఆదాయం వస్తుందని ఆశిస్తున్నా నిరాశే ఎదురవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి పంటను దోచుకుంటున్నారు.
– ఎస్.మంగయ్య, ఎంపీటీసీ

మన్యంలో కిలో అల్లం రూ.40

మన్యంలో కిలో అల్లం రూ.40

మన్యంలో కిలో అల్లం రూ.40