
నత్తల నివారణకు చర్యలు తీసుకోండి
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: నత్తల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఉద్యాన, వ్యవసాయాధికారులను ఆదేశించారు. నత్తల నివారణపై సంబఽంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో శనివారం మాట్లాడారు. ఉద్యాన, వ్యవసాయాధికారులు అవిశ్రాంతంగా పనిచేసి పంటను కాపాడే మార్గం చూపాలన్నారు. రైతులకు ధైర్యం చెప్పాలని సూచించారు. పంటకు నష్టం కలిగిస్తున్న ఆఫ్రికన్ నత్తలను నిర్మూలించే పద్ధతులపై రైతులకిచ్చే సూచనలు స్పష్టంగా ఉండాలన్నారు. గాలి, వెలుతురు, నేలకు ఎండ తగలకపోవడమే నత్తల విస్తరణకు ప్రధానకారణమన్నారు. ఎప్పటికప్పుడు నత్తలను ఏరి ఉప్పునీటి ద్రావణంలో వేయాలని, మెటాల్డ్‌హైడ్ గుళికలను ఎకరానికి 3 నుంచి 5 కిలోలు వేయాలన్నారు. 25 కిలోల ఊక, మూడు కిలోల బెల్లం, వంద గ్రాముల థియోడీకార్స్, 100 మీ.లీ ఆముదం నూనె కలిపి చిన్నచిన్న ఉండలు చుట్టి అక్కడక్కడా పంట పొలాల్లో పెడితే వీటిని తిని నత్తలు చనిపోతాయని తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జీఎస్‌ఎన్ రెడ్డి పాల్గొన్నారు.