
పార్వతీపురం రూరల్/మక్కువ: తన తల్లిపై దాడి చేసేందుకు వచ్చే క్రమంలో నిందితుడు ఆదినారాయణ పదునైన ఆయుధంతో పొడవడంతో ప్రాణాలు పోగొట్టుకున్న మృతుడు సాగరాపు కార్తీక్ ఘటన పాఠకులకు విదితమే. అయితే ఈ క్రమంలో శుక్రవారం ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మక్కువ పోలీసులు నిందితుని ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న క్రమంలో మృతుని తల్లి దమయంతి నిందితుడి భార్య హేమలత వైపు కోపంగా చూసిన కారణంతో భయాందోళన చెంది ఇంట్లో వున్న జొన్నచేళ్లకు ఉపయోగించే పురుగుల మందును తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు మక్కువ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్టు ఈ మేరకు వివరాలు సేకరించినట్టు జిల్లా కేంద్ర ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపారు.