
గూడ్స్ రైలు ఢీకొని యువకుడి మృతి
బొండపల్లి: మండలంలోని కనిమెరక రైల్వే గేటుకు సమీపంలో రైల్వేట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలంలోని వింద్యావాసి గ్రామానికి చెందిన టి.శంకరరావు (26) రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
గంట్యాడ: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దిగువ కొండపర్తి గ్రామానికి చెందిన ఎర్రబోయిన కొత్తమ్మ (40) తాను నివసిస్తున్న పూరి గుడిసెలో గుర్తు తెలియని పాము కాటు వేయడంతో మరణించింది. దీనిపై ఫిర్యాదు అందడంతో గంట్యాడ పోలీసులు మృతదేహాన్ని ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మృతురాలికి 16 ఏళ్ల వయసు గల కుమార్తె ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గూడ్స్ రైలు ఢీకొని యువకుడి మృతి