
ఆన్‌లైన్‌లో అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్
పార్వతీపురం రూరల్: 40 శాతం పైగా అంగ వైకల్యం ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తదనుగుణంగా ఆన్‌లైన్‌లో అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అపీల్‌ను విధిగా అధికారులు ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామాల్లో స్పష్టమైన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
కౌశలంలో అప్‌లోడ్ చేయాలి
నిరుద్యోగ యువతీ యువకులు వివరాలను కౌశలం పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ధ్రువీకరణ పత్రాలు ఈ మెయిల్, మొబైల్ వివరాలను నమోదు చేయాలని ఆయన తెలిపారు. నమోదు చేసిన అభ్యర్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, డీఎంహెచ్‌వో డా. ఎస్.భాస్కరరావు, డీసీహెచ్ డా.నాగభూషణరావు, ఎస్‌డీసీ దిలీప్ చక్రవర్తి పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్