
పారా జాతీయ స్థాయి పోటీలకు పయనం
విజయనగరం: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వేదికగా ఈనెల 29 నుంచి 31 వరకు జరుగబోయే 15 వ పారా జూనియర్, సబ్ జూనియర్స్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి క్రీడాకారులు పయనమయ్యారు. వాంరందరికీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారా రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 13 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. గతం కంటే ఈసారి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరువుతున్నారని, జాతీయస్థాయి పోటీలలోనూ బాగా రాణించి క్రీడల్లో జిల్లా కీర్తి, ప్రతిష్టలు మరింతగా పెంచాలని పిలుపునిచ్చారు.