
జారిపడి పెయింటర్ మృతి
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీకి చెందిన బి.చినరాము (40) ప్రమాదవశాత్తు రెండతస్తుల బిల్డింగ్ పై నుంచి జారిపడి గురువారం అక్కడికక్కడే మృతిచెందాడు. పట్టణంలోని గూడ్‌షెడ్‌రోడ్డులో నివాసం ఉంటున్న చినరాము పెయింటర్‌గా పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి జారిపడి మృతిచెందినట్లు అందిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై గోవింద కేసు నమోదు చేశారు.
విద్యార్థుల కొట్లాటపై కేసు నమోదు
పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు నెలరోజుల క్రితం కళాశాలలో వాగ్వాదం జరిగి గొడవపడిన నేపథ్యంలో బుధవారం పట్టణంలోని నెహ్రూమార్కెట్ ఎదుట లస్సీషాపు వద్ద మళ్లీ ఇరువర్గాలు పడిన ఘర్షణ కొట్లాటకు దారితీయడంతో నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు.