రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి.. | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..

Aug 29 2025 6:30 AM | Updated on Aug 29 2025 6:30 AM

రైలు

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి.. చెట్టును బస్సు ఢీ కొని ఒకరు.. విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి.. పాము కాటుతో వ్యక్తి..

జియ్యమ్మవలస రూరల్‌: (45) రైల్వే ట్రాక్‌ మెయింటనెన్స్‌ నాలుగవ తరగతి ఉద్యోగి, మండలంలోని సింగనాపురం పంచాయతీ తుమ్మల దత్తవలస గ్రామానికి చెందిన బంకపల్లి సత్యనారాయణ రైలు ఢీకొని మృతి చెందాడు. ఈనెల 26న కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే బైపాస్‌ లైన్‌ క్యాబిన్‌ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఆ సమయంలో వస్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన గతంలో మిలట్రీలో పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దుర్ఘటన అనంతరం మృతుని కుటుంబానికి సమాచారం అందించి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బుధవారం ఆయన స్వగ్రామమైన తుమ్మల దత్తవలసకు రైల్వేసిబ్బంది తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సంధ్యారాణి, కుమారుడు నాని, కుమార్తె శశితో పాటు తండ్రి బంకపల్లి రాములు, తల్లి రేగాలమ్మ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద సత్యనారాయణ మృతితో కుటుంబమంతా తీవ్ర మనస్థాపానికి గురైంది.

సీతానగరం: మండలంలోని జాతీయ రహదారిపై మరిపివలస జంక్షన్‌ వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఆర్టీసీబస్సు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మంది గాయాల పాలయ్యారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో సీతానగరం మీదుగా రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మరిపివలస జంక్షన్‌ వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సుకు ఎడమ భాగాన సీట్లో కూర్చున్న బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎ.శ్రీను(41) మృతి చెందగా బస్పులో ఉన్న 13 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పార్వతీపురంలోని ప్రైవేట్‌, ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజేష్‌ మాట్లాడుతూ శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలియజేశారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

బొబ్బిలి: మున్సిపాలిటీ పరిధి యాతవీధి లో నివాసముంటు న్న గొంప దాడిబా బు(27) విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. దీనిపై ఎస్సై ఎల్‌. రమేష్‌ తెలియజేసిన వివరాల ప్రకారం బుధవారం ఇంటి పక్కనే ఉన్న పూరిపాకలో నిద్రించాడని, దాడిబాబు ఇంటి నుంచి పాకలో ఉన్న ఫ్యాన్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వగా ఆ వైరు అక్కడక్కడా తెగి ఉండడంతో ప్రమాదవశాత్తు తగిలి షాక్‌కు గురై మృతి చెందాడని తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారికి అప్పగించామని తెలిపారు.మృతుడు దాడిబాబుకు భార్య రాధ ఉంది.

కొమరాడ: మండలంలోని గంగరేగువలస గ్రామానికి చెందిన దాసరి తిరుపతి(50) పాము కాటుతో మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం చేసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రహదారిపై తిరుపతిని పాము కాటు వేసింది. దీంతో గ్రామస్తులు ఓ ప్రైవేట్‌ అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణం విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..1
1/3

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..2
2/3

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..3
3/3

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement