
పెన్సిల్‌తో ఆకర్షణీయంగా కలెక్టర్ చిత్రం
పార్వతీపురం: పార్వతీపురంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నతపాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న రుగడ శ్రీనివాసరావు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ చిత్రాన్ని పెన్సిల్‌తోవేసి తన ప్రతిభను కనబరిచి కలెక్టర్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చిత్రాన్ని పెన్సిల్‌తో ఆయన ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ను కలిసి పెన్సిల్‌తో వేసిన చిత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పెన్సిల్‌తో వేసిన చిత్రాన్ని చూసిన కలెక్టర్, శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు. గరుగుబిల్లి మండలం, రావివలస గ్రామానికి చెందిన శ్రీనివాసరావు చిన్నతనం నుంచి చిత్రాలు వేసి ఈప్రాంతీయుల అభిమానాన్ని చొరగొంటున్నారు.