
ఎంపీఎఫ్‌సీ గొడౌన్‌లకు బిల్లుల చెల్లింపు
విజయనగరం అర్బన్: నిర్మాణాలు పూర్తయిన ఎంపీఎఫ్‌సీ (మల్టీ పర్పస్ ఫెసిలిటేటింగ్ సెంటర్) గొడౌన్‌లకు బిల్లుల చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సహకార శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తన చాంబర్‌లో సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నిర్మిస్తున్న ఎంపీఎఫ్‌సీ గొడౌన్‌ల పనులపై సమీక్ష చేశారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయిన 11 గొడౌన్లకు ఫైనల్ పేమెంట్, ఒక గొడౌన్‌కు పార్ట్ ఫైనల్ పేమెంట్ కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. పనులు మొదలుకాని గొడౌన్‌లకు అనుమతులు రద్దు చేయాలని తెలిపారు. మిగిలిన వాటి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా సహకార శాఖ అధికారి పి.రమేష్, డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరావు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.