నిబంధనలు పాటించాలి
● జేసీ శోభిక
పార్వతీపురం రూరల్: సినిమా థియేటర్ల నిర్వహణలో నిబంధనలు పాటించాల్సిందేనని జేసీ ఎస్.ఎస్.శోభిక యాజమాన్యాన్ని ఆదేశించారు. నర్సిపు రం టీబీఆర్ థియేటర్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఆర్‌పీ ధరల ప్రకారం తినుబండారాల విక్రయం చేస్తున్నది లేనిది ఆరా తీశారు. ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించాలని ఆహార భద్రత అధి కారి రామయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయలక్ష్మి, వీఆర్‌ఓ శంకర్ పట్నాయక్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
సాలూరులో..
సాలూరు రూరల్: పట్టణంలోని లక్ష్మి, శ్రీలక్ష్మి, రామాథియేటర్లను తహసీల్దార్ ఎన్.వి.రమణమూర్తి పరిశీలించారు. ఫస్ట్‌షో ప్రదర్శించకపోవడంతో మరోమారు పరిశీలనకు వస్తానని తెలిపారు.
పాలకొండలో..
పాలకొండ రూరల్: పాలకొండ పట్టణం, మండల పరిధిలోని నాలుగు సినిమా థియేటర్లను తహసీల్దా ర్ బాలమురళీ కృష్ణ బుధవారం పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ఉన్నతాధికారుల సూచనలతో ఈ పరిశీలన చేపట్టామన్నారు.


