బాకై ్సట్ తవ్వకాలపై గిరిజనుల ఆందోళన
● కొటియా గ్రామాల ప్రజలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు:
వివాదాస్పద ఆంధ్రా ఒడిశా సరిహద్దు కొటి యా గ్రూప్ 22 గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం బాకై ్స ట్ తవ్వకాలు చేపడుతుందని అక్కడి గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సంధ్యారాణితో పాటు సంబంధిత మంత్రులు, అధికారులు స్పష్టత ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఒడిశా ప్రభుత్వం త్వరలో పొట్టంగి బ్లాక్ పరిధిలో బాౖక్సైట్ తవ్వకాలకు సిద్ధమవుతోందని టీడీపీ ప్రభుత్వం గెజిట్ పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయన్నారు. ఈ తవ్వకాలు కొటియా గ్రూప్ గ్రామాల్లో, గ్రామ సమీప పరిసరాల్లో జరుగుతాయేమోనని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారన్నా రు. క్రిస్మస్ వేడుకలకు తాను వెళ్లగా అక్కడి గిరిజనులంతా బాకై ్సట్ తవ్వకాలపై ఆందోళనకు గురైన విషయాలను వివరించారన్నారు. 22 కొటియా గ్రూప్ గ్రామాల్లో ఈ బాకై ్సట్ తవ్వకాలు జరుగుతా యో లేదోనన్న విషయంపై ఆంధ్రా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. స్టేటస్ కో అమలులో ఉన్న ఈ గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం ఈ తవ్వకాలు చేపట్టినట్లయితే వెంటనే ఆంధ్రా ప్రభుత్వం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలని సూచించారు. ఆంధ్రాకు మద్దతుగా నిలుస్తున్నారని అక్కడి గిరిజనుల ను ఒడిశా అధికారులు బెదిరింపులకు గురిచేసి భయాందోళన పెడుతున్నారని వివరించారు. ఇంత జరుగుతున్నా స్దానిక మంత్రి సంధ్యారాణి గాని లేదా కలెక్టర్, ఐటీడీఏ పీఓలు తదితర అధికారులెవరూ ఇక్కడి గిరిజనులు గోడును పట్టించుకోవడం గాని, ఈ ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా నిలబడతామని ధైర్యం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బాకై ్సట్ తవ్వకాలు జోరుగా సాగుతున్నట్లు గిరిజనులు చర్చించుకుంటున్నారని, 2014–19 మధ్య కూడా ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడ గిరిజనులు వద్దంటున్నా బాకై ్సట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా ఆ ప్రాంతాలను నాడు జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తాను వెళ్లి పర్యటించామని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ అనుమతులు రద్దుచేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే అనుమతులు రద్దుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఈ కొటియా గ్రామాల సమస్య పరిష్కారం కోసం తాను నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసి చర్చించారని వివరించారు. ఈ విషయంపై నాడు ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణి ఈ బాకై ్సట్ గనుల గురించే అంటూ ఆరోపణలు చేశారని, మరినేడు ఈ బాకై ్సట్ తవ్వకాలపై మంత్రిగా కొనసాగుతూ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ విషయాన్ని గిరిజనులు గమనిస్తున్నారన్నారు. మంత్రి ప్రజావ్యతిరేక పాలనపై గిరిజన గూడల్లో చర్చసాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు బీసు, గొర్లె రాజారావు, తాడంగి కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.


