మెగా పశు వైద్య శిబిరం
పార్వతీపురం రూరల్: జిల్లాలో పశుసంపదను వృద్ధి చేసి, రైతులకు పాడితో అదనపు ఆదా యం చేకూర్చడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. ఎం.ఆర్.నగర్‌లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన ‘మన్యం గోబాల సంబరం’ మెగా పశు వైద్య శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. పశుపోషణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతు లు శాసీ్త్రయ పద్ధతులు పాటించి పాలు, మాంసం ఉత్పత్తిలో జిల్లాను అగ్రగామిగా నిలపాల ని పిలుపునిచ్చారు. శిబిరంలో వివిధ మండలా ల నుంచి వచ్చిన 162 ఉత్తమ జాతి లేగ దూడ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిపుణులైన వైద్య బృందం 126 పశువులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగా, 105 ఆవులు, గేదెలకు గర్భకోశ సంబంధిత చికిత్సలు చేశారు. 652 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలె క్టర్ డా.ఆర్ వైశాలి, జిల్లా పశుసంవర్థక శాఖాధి కారి డాక్టర్ శివ్వాల మన్మథరావు పాల్గొన్నారు.
పార్వతీపురం: వినూత్న కార్యక్రమాల అమల తో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్‌రెడ్డికి డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ ఓ కెవీఎస్ పద్మావతి, ప్రోగ్రాం అధికారులు టి. జగన్‌మోహన్‌రావు, రఘుకుమార్, వినోద్ కు మార్, ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం: రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో పార్వతీపురం వాసవీ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎస్.ఎం.నిఖిత ప్రథమ స్థానంలో నిలిచింది. బాలికను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం అభినందించారు. అలాగే, జిల్లాస్థాయిలోని వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఠాగూర్ నాయుడు, ఎం.ఎం.వైష్ణవి, కె. పూర్ణచంద్‌లను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
రేగిడి: మండంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఇంతవరకు 33 వేల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయిన ట్టు యాజమాన్యం శుక్రవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి చెరకును కర్మాగారానికి తీసుకువస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్టు వెల్లడించింది.
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని కేజీబీవీలో రెండేళ్ల కిందట నాటిన ఓ గులాబీ మొక్క నేడు విరబూసింది. 80 గులాబీ పూలతో బాలికలను ఆకర్షిస్తోంది. – గుమ్మలక్ష్మీపురం
మెగా పశు వైద్య శిబిరం
మెగా పశు వైద్య శిబిరం
మెగా పశు వైద్య శిబిరం


