చలో కలెక్టరేట్ రేపు
● డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్
విజయనగరం గంటస్తంభం: డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఈ నెల 14న తలపెట్టిన చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డీవైఎఫ్‌ఐ) సభ్యులు పిలుపుని చ్చారు. కోట కూడలిలో సోమవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్.హరీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులు పోరాడి డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నారన్నారు.
ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారికి, రెగ్యులర్ డిగ్రీ పాస్ అయిన వారికి సమాన అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాకు ఒకే పేపర్‌తో పరీక్ష నిర్వహించాలన్నారు. 14న కోట కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే ర్యాలీలో డీఎస్సీ అఽభ్యర్థులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాను, ఈశ్వరరావు, శ్రీను, కిషోర్, రవి తదితరులు పాల్గొన్నారు.


