మీడియాపై నిర్బంధాలు తగవు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించని సందర్భాలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిని పోలీసులు చుట్టముట్టడం భావ్యం కాదు. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య యుతంగా స్పందించాలి. తమ వైఖరిని పాలకులు, అధికారులు తెలియజేయవచ్చు. అంతేగానీ గృహ నిర్బంధాలు, దాడులు తగవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలి.
– పాలక రంజిత్‌కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి
●


