వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం
పార్వతీపురంటౌన్: వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ వింగ్ జనరల్ సెక్రటరీగా కురుపాంకు చెందిన ఆర్.చైతన్య శ్రవంతి, రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పింఛనర్ల విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పీవీఎస్‌ఎస్ సోమయాజులు (కురుపాం), సెక్రటరీగా కాగాన ప్రకాశం (పార్వతీపురం)ను నియమించింది. వీరికి పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపాయి.
ఈదురు గాలులు
పార్వతీపురం రూరల్: పార్వతీపురంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు జనాన్ని వణికించాయి. నర్సిపురం మీదుగా చినబొండపల్లి, రంగంవలస, ఎంఆర్ నగరంతో పాటు మరో ఐదు గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే తీగెలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా పనులను పునరుద్ధరిస్తున్నట్టు ఏఈ రామారావు తెలిపారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనిలో ట్రాన్స్‌కో సిబ్బంది


