ఎన్నాళ్లీ.. నిరీక్షణ..? | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..?

Apr 5 2025 1:01 AM | Updated on Apr 5 2025 1:01 AM

ఎన్నా

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..?

శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
● టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● పార్వతీపురం, సాలూరులో 95 శాతం పనులు పూర్తి ● మిగులు పనులను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ● ప్రభుత్వం నిర్లక్ష్యంతో పేదలకు దక్కని గృహయోగం ● జిల్లాలో 1898 మంది లబ్ధిదారులు ● గత ఎన్నికల్లో హామీ ఇచ్చి పట్టించుకోని ప్రభుత్వం ● గృహాల కోసం లబ్ధిదారుల ఎదురుచూపు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయికే..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయికే పేదలకు ఇంటిభాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో 1100, పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 798 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి పూనుకుంది. ఐదేళ్ల కాలంలో శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టింది. 95 శాతం పనులు పూర్తిచేసింది. మిగులు పనులు పూర్తి చేసేందుకు ఎన్నికల ముందు రూ.11 కోట్లు మంజూరు చేసింది. ఎన్నికల కోడ్‌ కారణంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక అసంపూర్తి పనులపై దృష్టిసారించడంలేదు.

కూటమి ప్రభుత్వం చొరవ

చూపడం లేదు

2017లో నాకు టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. అప్పుడు రూ. 500 చెల్లించాను. కేవలం శంకుస్థాపనకే అప్పటి టీడీపీ ప్రభుత్వం పరిమితమైంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంటి పనులు ప్రారంభించింది. దాదాపు పూర్తిచేసింది. నా పేరు మీద ఇంటిని రిజిష్ట్రేషన్‌ కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలవుతున్నా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టకపోవడం విచారకరం.

– పి.మార్కండేయులు, లబ్ధిదారు,

పార్వతీపురం

పార్వతీపురంటౌన్‌:

టిడ్కో ఇళ్లకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం 95 శాతం పూర్తిచేసిన ఇళ్ల పనులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపంగా మారింది. చిన్నచిన్న పనుల పూర్తిచేయడంలో ప్రభుత్వ అలసత్వం వల్ల ఇళ్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. లబ్ధిదారులకు అద్దెకష్టాలు తప్పడంలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై అధిక శ్రద్ధ చూపింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అప్పగించింది. కొన్నిచోట్ల పనులు చివరిదశలో ఉన్న సమయంలో ప్రభుత్వం మారడంతో టిడ్కో ఇళ్ల గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. టిడ్కో ఇంటి సదుపాయం కలగక లబ్ధిదారులు అద్దె ఇళ్లలోనే అవస్థల జీవనం సాగిస్తున్నారు. ఇంటి కోసం ఇంకా ఎన్నాళ్లు నిరీక్షించాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

పేదల ఇళ్లపై వివక్ష

కూటమి ప్రభుత్వం రావడంతో టిడ్కో ఇళ్ల మిగులు పనులపై కనీసం దృష్టిసారించ లేదు. పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో 1898 టిడ్కో ఇళ్లు నిర్మించారు. పార్వతీపురంలో తాగు నీరు, డ్రైనేజీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై వివక్ష చూపడం సరికాదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగులు పనులు పూర్తి చేసి పేదలకు అందజేయాలని కొరుతున్నారు.

2017లో పేదల వద్ద వసూళ్లు

జిల్లాలో సాలూరు, పార్వతీపురంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులను గుర్తించి 2017లో వారి వాటాగా రూ.500 కేటగిరీలో 300 చదరపు అడుగులు, రూ.25,000 వేల కేటగిరీలో 365 చదరపు అడుగులు, రూ. 50వేలు కేటగిరీలో 430 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణానికి నిర్ణయించారు. ఈ మేరకు లబ్ధిదారుల వద్ద నుంచి పార్వతీపురంలో రూ.1.75 కోట్లు, సాలూరులో రూ.1.08 కోట్లు వసూలు చేశారు. పేదల నుంచి అప్పట్లో డబ్బులు వసూలు చేసిన టీడీపీ ప్రభుత్వం కనీసం పనులు ప్రారంభించ లేదు.

పనులు పూర్తి కాగానే అందజేస్తాం

టిడ్కో గృహ సముదాయాల్లో పనులు పూర్తికాగానే లబ్ధిదారులకు అందజేస్తాం. సాలూరు, పార్వతీపురంలో 1898 గృహాలకు సంబంధించి పనులు పూర్తయ్యాయి. తాగునీటి వసతి పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తాం.

– స్వాతి, టిడ్కో ఏఈ, పార్వతీపురం మన్యం

న్యూస్‌రీల్‌

ఇబ్బందులు పడుతున్నాం

20 ఏళ్లుగా అద్దె ఇంటిలో ఉంటున్న నాకు టిడ్కో ఇల్లు వస్తుందని ఆశపడ్డాను. 2017 సంవత్సరంలో సొంతింటి భాగ్యం కలుగుతుందన్న ఆశతో అప్పుచేసి తొలివిడతలో రూ.12,500 వేలు చెల్లించాను. ఇప్పటి వరకు ఇల్లు కేటాయించలేదు. ఓ వైపు రుణానికి వడ్డీ, మరో వైపు అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.

– బంగారు సంతోష్‌ కుమార్‌, లబ్ధిదారు, పార్వతీపురం

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..? 1
1/5

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..?

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..? 2
2/5

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..?

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..? 3
3/5

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..?

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..? 4
4/5

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..?

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..? 5
5/5

ఎన్నాళ్లీ.. నిరీక్షణ..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement