పార్వతీపురం టౌన్: భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసుల శాఖాధికారి ఎ.సోమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10 వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జాయిన్ ఇండియన్ ఆర్మీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వారి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఆర్మీ ర్యాలీ తేదీ సమయం పొందగలరని తెలిపారు. ఆన్‌లైన్ పరీక్ష పాసైన వారికి ఆర్మీర్యాలీ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఆసక్తిగల జిల్లా యువత ఇండియన్ ఆర్మీలో చేరేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయం పనివేళల్లో సెట్విజ్ మేనేజర్ కె.వెంకటరమణ, మొబైల్ 9849913080 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
అర్హతలు..
అగ్నివీర్ జనరల్ బ్యూటీ, ట్రేడ్‌మెన్ అభ్యర్థులు 166 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్ అభ్యర్థులు 165 సెంటీమీటర్ల ఎత్తు, టెక్నికల్ అభ్యర్థులు 162 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. చాతీ 77 సెంటీమీటర్లు, ఊపిరి పీల్చినప్పుడు 5సెంటీమీటర్ల విస్తీర్ణం పెరగాలి. ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండాలి.
● అగ్నివీర్‌లో జనరల్ ఉద్యోగానికి పదోతరగతి 45శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
● అగ్నివీర్ టెక్నికల్ ఉద్యోగానికి ఇంటర్మీయట్ ఉత్తీర్ణతతోపాటు ప్రతి సబ్జెక్టులో కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 50శాతం మార్కులు ఉండాలి.
● అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌లో టెక్నికల్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్టులతో కనీసం 60శాతం మార్కులు, ప్రతి సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
● అగ్నివీర్ ట్రేడ్స్‌మేన్ ఉద్యోగాలకు 8,10 తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు అక్టోబర్ 2004 నుంచి ఏప్రిల్ 2008 మధ్య జన్మించి ఉండాఅని జిల్లా యువజన సర్వీసుల శాఖాధికారి ఎ.సోమేశ్వరరావు సూచించారు.
అగ్నివీర్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా యోజన సర్వీసుల శాఖాధికారి ఎ.సోమేశ్వరరావు