పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంద్ర కార్యక్రమా న్ని పెద్దఎత్తున నిర్వహిస్తామని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కార్యక్రమం నిర్వహణపై అధికారులతో కలెక్టర్ శుక్రవారం టెలికాన్ఫెరెన్స్ నిర్వ హించారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా ప్రతిగ్రామం స్వచ్ఛతతో ఫరిఢవిల్లాలని అన్నారు. తడి, పొడిచెత్త, అపాయకర వ్యర్థా లు వేరుచేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సేకరించిన చెత్తను చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లాలోని 451 గ్రామ పంచాయతీల్లోనూ కార్యక్రమం నిర్వహించేలా కార్యద ర్శులు బాధ్యత వహించాలన్నారు. మండల స్థాయిలో పరిశుభ్రత అంశాన్ని ఈవోఆర్డీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరులో పాల్గొంటారని, మిగిలిన ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో పాల్గొంటారని తెలిపారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆదేశించారు.


