పారిశ్రామిక వేత్తలకు శుభవార్త | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక వేత్తలకు శుభవార్త

Nov 14 2023 1:42 AM | Updated on Nov 14 2023 1:42 AM

బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌  - Sakshi

బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌

బొబ్బిలి: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అన్నిరకాల రాయితీలు కల్పిస్తోంది. సత్వర అనుమతులు మంజూరు చేస్తోంది. తాజాగా సంపూర్ణ హ క్కులతో స్థలాలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. గతంలో ఏపీఐఐసీలో స్థలాలు తీసుకుని పరిశ్రమలు పెట్టాలంటే కేవలం లీజు అగ్రిమెంట్‌ మాత్రమే ఉండేది. కంపెనీ స్థాపించాలనుకునే పారిశ్రామిక వేత్తలకు 33 సంవత్సరాలకు లీజు అగ్రిమెంట్‌పై స్థలం ఇచ్చేవారు. ఈ అగ్రిమెంట్‌తో వారు కంపెనీ నిర్మాణాన్ని ప్రారంభించేవారు. పెట్టుబడి చాలకపోయినా, కంపెనీని విస్తరించాలనుకున్నా బ్యాంకు రుణంకోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. బ్యాంకర్లు లీజు అగ్రిమెంట్‌పై రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపేవారు. ఈ సమస్యను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సేల్‌ డీడ్‌ అగ్రిమెంట్ల కు తెరతీసింది. దీంతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అధికమంది ముందుకు వస్తారని భావిస్తోంది. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో దాదాపు 150కి పైగా ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్లను ఇక నుంచి పారిశ్రామిక వేత్తలు తీసుకుని సేల్‌డీడ్‌ తో బ్యాంకు రుణాల సహాయంతో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

చిన్నతరహా పరిశ్రమలకు ఊతం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లీజు అగ్రిమెంట్ల రద్దు–సేల్‌డీడ్‌ అగ్రిమెంట్ల నిర్ణయం అమలుతో బొబ్బిలి, సాలూరు ప్రాంతంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువ. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో ఇప్పటికే చిన్న తరహా పరిశ్రమలకు వీలుగా ప్లాట్లు విభజించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఏపీఐఐసీ పరిశ్రమల కోసం కొనుగోలు చేసిన భూములను ప్లాట్లుగానే విభజించి ఉంచుతున్నారు. వీటికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ముందుగా సమర్పించే డీపీఆర్‌ను అనుసరించి పరిశ్రమ నిర్మా ణాన్ని దాదాపు పూర్తిచేసిన వారికి ఈ సేల్‌ డీడ్‌ అగ్రిమెంట్‌ వర్తిస్తుంది. కంపెనీ లేదా ఏదైనా ప్రాజెక్టు పూర్తయిన సదరు భూమికి ఎన్‌ఓసీ ఇస్తుంది.

నూతన పారిశ్రామికీకరణ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇక నుంచి సేల్‌ డీడ్‌లతో ఏపీఐఐసీ స్థలాల కేటాయింపు

గతంలో లీజు డాక్యుమెంట్లతో రుణాల మంజూరులో ఇబ్బందులు

ఔత్సాహికులకు ప్రారంభంలోనే

స్థలంపై సంపూర్ణ హక్కులు

ఔత్సాహికులకు మంచి అవకాశం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సేల్‌డీడ్‌ అగ్రిమెంట్‌ విధా నం మంచి నిర్ణయం. దీనివల్ల పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు. గతంలో మేము ఎన్నోసార్లు పరిశ్రమల కోసం స్థలా లు తీసుకున్న వారికి త్వరగా నిర్మాణాలు ప్రారంభించాలని, పూర్తి చేయాలని వారి వెనక తిరిగేవాళ్లం. ఆర్రిథక వెసులబాటు కోసం ఔత్సాహికులు ఎదురు చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు.

– బడగల హరిధరరావు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌, ఏపీఐఐసీ మూడు జిల్లాల జోన్‌

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement