సీఎం సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధి | Sakshi
Sakshi News home page

సీఎం సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధి

Published Sat, Jun 3 2023 1:32 AM

- - Sakshi

నెల్లిమర్ల రూరల్‌: సీఎం సహాయ నిధి ఆపదకాలంలో పేదల పాలిట పెన్నిధిలా నిలుస్తోందని ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌ బాబు అన్నారు. ఈ మేరకు మండలంలోని మొయిద గ్రామంలో ఆయన స్వగృహంలో పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. కెల్ల గ్రామానికి చెందిన పాపయ్యమ్మకు రూ.95వేలు, కొండవెలగాడ గ్రామానికి చెందిన బూటి సూరిబాబుకు రూ.2లక్షలు, మొయిద గ్రామానికి చెందిన శినగం ధమయంతికి రూ.లక్ష చొప్పున మంజూరు కాగా ఆ చెక్కులను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతం ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌ బాబు మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న వారికి సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం చెక్కులు అందుకున్న బాధితులు ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్సను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాశినాయుడు, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ చనమల్లు వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, నాయకులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి సీఎం సహాయనిధి

వీరఘట్టం: పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామానికి చెందిన అల్లు ఈశ్వరమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడింది.ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి హామీ ఇచ్చారు. ఈ కుటుంబ పరిస్థితిని ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.2.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.ఈ చెక్కును ఎమ్మెల్యే కళావతి వండవ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు చందక జగదీశ్వరరావు ఉన్నారు.

ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌ బాబు

బాధితులకు చెక్కుల పంపిణీ

బాధిత కుటుంబానికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కళావతి
1/1

బాధిత కుటుంబానికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కళావతి

Advertisement
Advertisement