పచ్చ పైశాచికం | - | Sakshi
Sakshi News home page

పచ్చ పైశాచికం

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

పచ్చ పైశాచికం అడ్డగోలుగా దాడులు, దౌర్జన్యాలకు దిగిన టీడీపీ మూకలు ● వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలే లక్ష్యంగా పోలీసులతో కలిసి కుట్రలు ● పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులకు వేధింపులు ● పోటీ చేయకుండా అడ్డుకునేందుకు అడుగడుగునా దౌర్జన్యకాండ ● కనపర్రు, చిరుమామిళ్ల, ఇర్లపాడు, చందవరం, అప్పాపురం గ్రామాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీసులు అక్రమంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. నామినేషన్లు వేయబోమని లిఖితపూర్వకంగా చెబితేనే వదిలి పెడతామంటూ బెదిరించారు. వైఎస్సార్‌ సీపీ మండల మాజీ అధ్యక్షుడు చందవరం గ్రామానికి చెందిన గొంటు శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు కనపర్రుకు చెందిన గుంజి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు రవికుమార్‌, బుక్కాపురం మాజీ సర్పంచ్‌ అల్లడి రవికుమార్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ చిరుమామిళ్లకు చెందిన సింగారెడ్డి కోటిరెడ్డి, ఆయన కుమారుడు బుజ్జి, మరికొందరు వైఎస్సార్‌ సీపీ నాయకులను ఇలా నిర్బంధించారు. బుక్కాపురం గ్రామ సర్పంచ్‌ స్థానం ఓపెన్‌ కేటగిరీ మహిళకు కేటాయించడంతో అల్లడి రవికుమార్‌ భార్య నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. చందవరం సర్పంచ్‌ స్థానం కూడా ఓసీ జనరల్‌కు కేటాయించటంతో గొంటు శ్రీనివాసరెడ్డి నామినేషన్‌ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామానికి చెందిన టీడీపీ రెబల్‌ అభ్యర్థులను, బుక్కాపురం జనసేన రెబల్‌ అభ్యర్థిని కూడా పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి స్టేషన్‌లో కూర్చోబెట్టడంపై ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ● నామినేషన్ల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామనే సాకుతో యడ్లపాడు పోలీసులు తమ పార్టీకి చెందిన కీలక నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు తెలిపాయి. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహరావు, నాయకులు పల్లపు లక్ష్మీనారాయణ, వంకాయలపాటి సాయితేజ, ఆలకుంట వెంకట్రావు, పల్లపు శంకర్‌, గుంజి వేణు, విప్పర్ల పేతురుబాబులను నామినేషన్ల గడువు ముగిసే వరకు స్థానిక పోలీస్‌ స్టేషనులోనే ఉంచారు. ఈ కారణంగా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

దాచేపల్లి మండలం రామాపురంలో నామినేషన్‌ కేంద్రానికి వెళ్లే మార్గంలో ట్రాక్టర్‌ ట్రక్కును అడ్డంగా పెట్టి ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు దేవళ్ల వీరాస్వామి, గొగిరెడ్డి వెంకటరెడ్డి, వట్టె రామచంద్రారెడ్డి, మేడతి నరసింహారావు, ఉల్లేరు హనుమంతరావు, జంగిలి నరసింహారావు, రాచకొండ కోటయ్య, కర్పూరపు వెంకటకోటయ్య, షేక్‌ సైదాలతో పాటు పలువురు నాయకులను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

మాచవరం మండలం మోర్జంపాడు గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ కోసం కొత్తపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నామినేషన్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ సీపీ మద్దతుతో గ్రామానికి చెందిన మహిళలు, కార్యకర్తలు పాదయాత్రగా, మరికొందరు ట్రాక్టర్లలో కొత్తపాలెంకు బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

మాచవరం మండలం రేగులగడ్డలో సర్పంచ్‌ అభ్యర్థి సింగడాల శ్రీనివాసరావుపై దాడి జరిగింది. వేమవరం రైతు సేవా కేంద్రంలోని నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన ఆయనపై అక్కడే కాపు కాసి ఉన్న కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన భార్య శాంతకుమారి చేతికి గాయమైంది.

మాచవరంలోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ కేంద్రాన్ని పిన్నెల్లి గ్రామంలోని స్వర్ణ గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేసేందుకు వెళ్లగా టీడీపీ గూండాలు బరితెగించారు. మహిళలు, కార్యకర్తలపై దాడికి యత్నించారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్త గడ్డం మున్నాకు చెందిన ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎస్టీ కాలనీకి చెందిన వారు వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసేందుకు ఆటోలో వెళ్తుండగా దాడికి యత్నించారు. రాళ్లు విసురుతూ, కర్రలతో వెంటాడారు.

గుత్తికొండ గ్రామానికి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి సైదా వలి, వార్డు సభ్యులు నామినేషన్‌ వేసేందుకు బ్రాహ్మణపల్లిలోని జిల్లా పరిషత్తు హైస్కూల్లో నామినేషన్‌ కేంద్రానికి చెన్నాయిపాలెం నుంచి బయలుదేరారు. స్థానిక టీడీపీ ఎంపీపీ గండికోట వెంకటేశ్వర్లు కారు అడ్డంపెట్టి దౌరన్యానికి దిగారు. ఎస్‌ఐ మోహన్‌ అక్కడికి వెళ్లడంతో టీడీపీ గూండాలు గుత్తికొండ గ్రామస్తులపై దాడికి దిగారు. వారితోపాటు పోలీసులు కూడా పురుషులు, మహిళలని చూడకుండా వెంటపడి కొట్టారు. సర్పంచ్‌ అభ్యర్థి సైదావలి, సిద్ధమ్మ, నాగుల మీరాకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

పిడుగురాళ్ల మండలంలోని కరాలపాడు గ్రామనికి చెందిన గ్రామస్తులు సర్పంచి, వార్డు పదవులకు నామినేషన్లు వేసేందుకు పిడుగురాళ్ల పట్టణంలోని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయానికి అభ్యర్థులు బయలుదేరారు. పట్టణ సీఐ శ్రీరామ్‌ వెంకట్రావు తమ సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. ఇరువర్గాల నడుమ తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పోలీసులు లాఠీచార్జి చేయడంతో మూడేల పద్మ అనే మహిళ చేయి విరిగింది. పలువుకు యువకులకు గాయాలయ్యాయి. మహిళలని చూడకుండా సీఐ దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆర్డర్‌ తెచ్చుకోవాలని సీఐ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం నామినేషన్‌ వేయిస్తానని సీఐ హామీ ఇవ్వడంతో శాంతించారు.

పిడుగురాళ్ల మండలంలోని జానపాడు వైఎస్సార్‌ సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి బిల్లా మొహిద్దిన్‌ బీ నామినేషన్‌ వేసేందుకు వస్తుండగా టీడీపీ మూకలు వారి ఆటోపై దాడి చేశాయి. మహిళలని కూడా చూడకుండా హైవే వరకు పచ్చగూండాలు వారిని నెట్టుకుంటూ వచ్చారు. ఎస్‌ఐ మోహన్‌ వచ్చి వైఎస్సార్‌ సీపీ వారిని పంపించేశారు. దీంతో పోలీసులకు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.

ఆగని దారుణాలు
మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో పచ్చ మూకల అరాచకాలు తారస్థాయికి చేరాయి. ఓటమి భయంతో వారు వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులను అసలు నామినేషన్‌ వేయకుండా కుట్రలకు తెరలేపారు. దాడులు, దౌర్జన్యాలు, కేసులతో కట్టడికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు దిగుతున్నారు. వారికి పోలీసులు కూడా నిస్సిగ్గుగా సహకారం అందిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించలేని చంద్రబాబు సర్కారు తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
అడ్డగోలుగా దాడులు, దౌర్జన్యాలకు దిగిన టీడీపీ మూకలు

సాక్షి నెట్‌వర్క్‌: పల్నాడు జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా గురజాల, మాచర్ల, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌ సీపీ మద్దతుతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు టీడీపీ మూకల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. నామినేషన్‌ కేంద్రాలకు వెళ్లే మార్గాలను ట్రాక్టర్లు, ముళ్ల కంచెలతో మూసివేయడంతోపాటు పలుచోట్ల దాడులకు యత్నించారు.

కీలక నేతల గృహ నిర్బంధాలు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన ఇంటికి వెళ్లే మార్గాల్లో కంచె ఏర్పాటు చేశారు. మాచర్ల మండలం కొత్తపల్లిలోని నామినేషన్‌ కేంద్రానికి ఎవరూ వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారు. తొలుత రాయవరంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాన్ని అకస్మాత్తుగా మాచర్లలోని మండల పరిషత్‌ కార్యాలయానికి మార్చారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో బుక్కాపురం మాజీ సర్పంచ్‌ అల్లడి రవికుమార్‌, అప్పాపురం మాజీ సర్పంచ్‌ కోయలమూడి సాంబశివరావు, ఇతర వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. వారికి రక్షణ కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న మాజీ మంత్రి విడదల రజినిని నరసరావుపేట అడిషనల్‌ ఎస్పీ హనుమంతరావు, రూరల్‌ సీఐ బి. సుబ్బానాయుడు అడ్డుకున్నారు. తర్వాత విడదల రజినిని చిలకలూరిపేట పట్టణంలోని ఆమె నివాసానికి తీసుకొచ్చి గృహ నిర్బంధం చేశారు. పిడుగురాళ్లలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని నరసరావుపేటలోని ఆయన నివాసానికి తరలించారు. పట్టణ సీఐ శ్రీరామ్‌ వెంకట్రావు, ఎస్‌ఐ మోహన్‌ ఆధ్వర్యంలో గృహ నిర్బంధం చేశారు.

రోజంతా పోలీస్‌ స్టేషన్‌లో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement