చేయూతనిస్తారా... చేతులెత్తేస్తారా? | - | Sakshi
Sakshi News home page

చేయూతనిస్తారా... చేతులెత్తేస్తారా?

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

● మురసు నష్టం తెలుసుకునేందుకు నేడు కేంద్ర బృందం పర్యటన ● చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన

యడ్లపాడు: ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాతలు వరుస నష్టాలు ఎదుర్కొంటున్నా పరిహారం మాత్రం అందడం లేదు. గత ఏడా ఖరీఫ్‌ చివరిలో మొంథా తుఫాన్‌.. ఆ తర్వాత అక్టోబరులో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ పరిహారం అందలేదన్న ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. తాజాగా అర్నబ్‌, మురసు తుఫాన్లు మరోసారి చికలూరిపేట నియోజకవర్గ రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ విపత్తు కారణంగా వాగుల కట్టలు తెగాయి. చెరువులకు భారీ గండ్లు పడ్డాయి. పలు విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. వ్యవసాయ, ఉద్యన పంటలు రెండు రోజులపాటు నీటిలో మునిగి రైతులకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో నష్టాలను పరిశీలించేందుకు శనివారం కేంద్ర అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందం చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనుంది.

పర్యటన సాగనుందిలా...

ఉదయం 10.30 గంటలకు చిలకలూరిపేట చేరుకుని మున్సిపల్‌ కార్యాలయంలో ఫొటో ప్రదర్శనను పరిశీలించనుంది. అనంతరం బొప్పుడిలో దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, విద్యుత్‌ స్తంభాల కూలిన వైనం, బాతుల పెంపకందారులకు జరిగిన నష్టాలను పరిశీలించనుంది. మధ్యాహ్నం నాదెండ్ల మండలం తూబాడులో తెగిపోయిన చెరువు కట్ట, లింగారావుపాలెం– నాదెండ్ల రహదారితో పాటు యడ్లపాడు –జగ్గాపురం –జాలాది మీదుగా తుర్లపాడు వరకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించనుంది. సాయంత్రం 5 గంటలకు పర్యటన ముగియనుంది. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. గత నష్టాలకే పరిహారం అందని పరిస్థితుల్లో తాజా పర్యటనతోనైనా రైతులకు న్యాయం జరుగుతుందా? లేక ఈసారి కూడా అధికారుల పరిశీలనలు, నివేదికలకే పరిమితమవుతుందా? అనే ఆందోళన బాధితుల్లో నెలకొంది. ప్రభుత్వం ఏ మేరకు ఆదుకుంటుందోనని వేచిచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement