● లేదంటే ఆందోళనలకు దిగుతాం ● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కే | - | Sakshi
Sakshi News home page

● లేదంటే ఆందోళనలకు దిగుతాం ● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కే

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

● లేదంటే ఆందోళనలకు దిగుతాం ● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కే

బాధ్యులైన వారిని జైలుకు పంపాలి

మాచర్ల: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ ఎంతో హుందాగా వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. అందుకు భిన్నంగా జనసేన నాయకులు సోషల్‌ మీడియా ద్వారా వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ భారతి రాజకీయాల గురించి ఎప్పుడూ స్పందించలేదన్నారు. ఆమైపె అనవసరంగా జనసేన నాయకులు సోషల్‌ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేయటం హేయమైన చర్య అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విడాకులు ఇచ్చిన ఉదంతంపై తీవ్ర చర్చ జరుగుతుంటే.. పార్టీ ఆదేశాల మేరకు ఏ ఒక్కరూ మాట్లాడకుండా సంయమనం పాటించామన్నారు. దానికి భిన్నంగా జనసేన నాయకులు కొందరు కావాలని రచ్చ చేస్తూ వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన వారు దీనికి సమాధానం ఇవ్వాలన్నారు. ఇప్పటికై నా స్పందించి వ్యక్తిగత దూషణ చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. ఎక్కడ చూసినా దారుణాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. దీనిని టీడీపీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement