పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

శనివారం శ్రీ 7 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం

శనివారం శ్రీ 7 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

నరసరావుపేట: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా ఆధ్వర్యంలో కౌంటింగ్‌ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. శనివారం జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని పెట్లూరివారిపాలెంలోని ఏఎం రెడ్డి కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను శుక్రవారం రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్షతో కలిసి జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 37 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలోని 28 జెడ్పీటీసీలకు గాను చిలకలూరిపేట, దాచేపల్లి, గురజాల, క్రోసూరు, మాచవరం, ముప్పాళ్ల, నూజెండ్ల, నకరికల్లు, పిడుగురాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గురువారం పోలింగ్‌ నిర్వహించారు. అలాగే 37 ఎంపీటీసీ స్థానాలకు కూడా పోలింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 70.93 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 576 పోలింగ్‌ స్టేషన్ల ద్వారా 4,60,784 మంది ఓటర్లకు గాను 3,26,850 మంది ఓటు వేశారు. వీరిలో పురుషులు 1,66,733 (36.18 శాతం) కాగా, మహిళలు 1,66,733 (34.75 శాతం). ఈ ఓట్ల లెక్కింపు కోసం 153 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 87 మంది సూపర్‌వైజర్లు, 213 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలోని సంబంధిత పోలీస్‌ స్టేషన్ల ద్వారా మూడంచెల భద్రతా చర్యలు చేపడుతున్నారు.

పొరపాట్లకు తావు ఇవ్వకండి

జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్‌ విధివిధానాలు, సిబ్బంది బాధ్యతలపై శుక్రవారం అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతి లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ రానీయొద్దని స్పష్టం చేశారు. ఏజెంట్లు కౌంటింగ్‌ హాళ్లలోకి ప్రవేశించే విధానాన్ని క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. కౌంటింగు సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, అధికారికంగా ధ్రువీకరించిన నివేదికలను అందజేయాలని ఆదేశించారు.

ఉదయం 8 గంటల నుంచి

‘జెడ్పీటీసీ, ఎంపీటీసీ‘ కౌంటింగ్‌

నిబంధనలు, పారదర్శకతపై

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

కౌంటింగ్‌ కేంద్రాన్ని స్వయంగా

పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

మూడు విడతల్లో ‘పంచాయతీ’ పోరు

మాచర్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం పల్నాడు జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలకు మూడు దశల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 28 మండలాలను వివిధ రెవెన్యూ డివిజన్ల ఆధారంగా మూడు విడతల జాబితాలో చేర్చారు. జిల్లాలోని మండలాలు ఏ దశల కిందికి వస్తాయో చూస్తే...

మొదటి దశ (నవంబర్‌ 26): నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌లోని నరసరావుపేట, చిలకలూరిపేట, రొంపిచర్ల, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.

రెండో దశ (నవంబర్‌ 29): సత్తెనపల్లి నియోజకవర్గం/డివిజన్‌ పరిధిలోని అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, ముప్పాళ్ల, నకరికల్లు, పెదకూరపాడు, రాజుపాలెం, సత్తెనపల్లి మండలాల్లో ఎన్నికలు ఉంటాయి.

మూడో దశ (డిసెంబర్‌ 2): మూడో విడతలో గురజాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని దాచేపల్లి, దుర్గి, గురజాల, కారంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు ఉంటాయి. ఆయా తేదీల్లో పోలింగ్‌ ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.3537 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement