టపాసుల మోతే! | - | Sakshi
Sakshi News home page

టపాసుల మోతే!

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

● అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం జనవాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో టపాసుల విక్రయాల దుకాణాలు ఉండరాదు. గోదాముల్లో సైతం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు. ● నివాస సముదాయాలకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలు ఉండాలి. ● తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాలు సైతం మూడు మీటర్ల దూరంలో ఉండాల్సి ఉంటుంది. ● దుకాణాలు దగ్గర సిగరెట్‌, బీడీ, చుట్ట తాగరాదు ● ప్రతి దుకాణం వద్ద ప్రత్యేకంగా నీటి సౌకర్యం, అగ్ని నిరోధక పరికరాలు అందుబాటు లో ఉంచుకోవాలి. ● జనావాసాల మధ్య తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసే చోట తప్పనిసరిగా అగ్రిమాపక ఎన్‌ఓసీ ఉండి తీరాలి. ప్రమాద బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ధూమపానం నిషేధిత స్థలంగా ప్రకటించాలి. ● అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అంటుకునే తడికలు, ప్లాస్టిక్‌ కవర్లతో దుకాణాలు ఏర్పాటు చేయరాదు. ప్రత్యేకంగా తయారు చేసిన జింక్‌, జీఐ రేకులతో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా షెడ్‌లలో హౌస్‌ కీపింగ్‌, చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి. ● ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి అగ్నిమాపక వాహనం వచ్చి చుట్టూ తిరిగే విధంగా స్థలం ఇచ్చి షెడ్లను నిర్మాణం చేసుకోవాలి. ● ఒక దుకాణానికి మరో దుకాణానికి కచ్చితంగా మూడు మీటర్ల దూరం ఉండాలి. వాటితో పాటు బాణసంచా కొనుగోలు చేయడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా దారులు ఏర్పాటు చేయాలి. ● విద్యుత్‌ వైరింగ్‌ చేసుకునే సమయంలో ఎలాంటిఅతుకులు లేని వైరు ఉపయోగించాలి. ఒక్కో సందర్భంలో వీటి నుంచి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వైరింగ్‌ ను జాగ్రత్తగా చూసుకోవాలి. ● {糆† §ýl$M>׿…-…ÌZ Æð‡Ð]l$…-…-r-ÌS¯]l$ BÆó‡µ ç³Ç-MýSÆ>Ë$, 200 ÎrÆý‡Ï {yýlÐ]l¬ÃË$, ¯éË$VýS$ ±sìæ ºMðS-rŒæË$, Æð‡…Æð-‡-…yýl$ CçÜ$MýS ºMðSrϯ]l$ A……§ýl$-»ê-r$ÌZ E……-^èl$-Mø-Ðé-Í. ● బాణసంచా దుకాణాల సమీపంలో ఎలాంటి పరిస్థితిల్లోనూ పొగ తాగరాదని ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. ● తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే దుకాణాలకు దూరంగా వాహనాలను పార్కింగ్‌ చేసేలా చూడాలి.

తాత్కాలిక బాణసంచా దుకాణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

పల్నాడు జిల్లాలో అనుమతుల కోసం వ్యాపారుల దరఖాస్తు

రూ.కోట్లలో టపాసుల వ్యాపారం

నిబంధనలు తప్పనిసరి అంటున్న అధికారులు

జిల్లాలో 46 పర్మినెంట్‌ లైసెన్స్‌ దుకాణాలు

జిల్లాలో ఇంకా ఖరారు కాని తాత్కాలిక దుకాణాలు

జిల్లాలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ రానే వచ్చింది. అందరూ బాణసంచా కొనుగోలుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేందుకు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక బాణసంచా దుకాణాల ఏర్పాటులో నిబంధనలు పాటించి తీరాలని యంత్రాంగం స్పష్టం చేస్తోంది.

సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలకు విక్రయ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో టపాసుల విక్రయ కేంద్రాల నిర్వహణకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశానుసారం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నారు. వాణిజ్య పనుల శాఖ, రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌, పంచాయతీ శాఖల సమన్వయంతో జిల్లాలోని శాశ్వత టపాసుల విక్రయ కేంద్రాలతోపాటు పండుగ సందర్భంగా తాత్కాలిక విక్రయ కేంద్రాల అనుమతుల విషయంపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల రెవెన్యూ డివిజనల్‌ అధికారులు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పోలీస్‌ శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో 46 శాశ్వత లైసెనన్స్‌ దారులకు అనుమతులు ఉన్నాయి. ఈ ఏడాది మళ్లీ వాటిని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంది. దీంతో పాటు తాత్కాలిక షాపులు ఏర్పాటు కోసం వ్యాపారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారు. ఈ విక్రయ కేంద్రాలను నివాస కేంద్రాలకు, పాఠశాలలకు, ఇతర ప్రమాదాలకు దూరంగా విశాలమైన ప్రదేశాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వన్‌ మెన్‌ కమిటీ...

బాణసంచా అమ్మకాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాల కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించింది. గతంలో రెవెన్యూ అధికారులు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేవారు. ఈ ఏడాది వన్‌మెన్‌ కమిటీ అంటే రెవెన్యూ, పోలీస్‌, ఫైర్‌, విద్యుత్‌ శాఖ సమన్వయంతో పాటు స్థానిక సంస్థలైన మున్సిపల్‌, పంచాయతీలు తాత్కాలిక విక్రయ కేంద్రాలకు అనుమతితో ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఉండే అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలన చేసి నివేదిక అందిస్తారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement