సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయవద్దు | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయవద్దు

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

నరసరావుపేట: డ్రైవింగ్‌ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌ మాట్లాడవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో వాహనాలు నడపుతూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని ఆర్‌టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి టి.అజితకుమారి పేర్కొన్నారు. స్థానిక ఏపీఎస్‌ ఆర్‌టీసీ డిపోలో నిర్వహిస్తున్న హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌లో 26వ బ్యాచ్‌ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ తీసుకున్న డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమానికి ఆమె హాజరై సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, డిపో మేనేజర్‌ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో 27వ బ్యాచ్‌ శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కోసం డ్రైవర్లు 7382896150 నంబర్లను సంప్రదించాలని కోరారు. డ్రైవింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ సుభాని, రిటైర్డు ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

ద్విచక్రవాహనం దగ్ధం

పిడుగురాళ్ల: బ్రాహ్మణపల్లి, కరాలపాడు హైవే జంక్షన్‌ వద్ద లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... పిడుగురాళ్ల వైపు నుంచి లోడ్‌ లారీ దాచేపల్లి వైపు వెళ్తోంది. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్‌ హుస్సేన్‌(40) కరాలపాడు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా బ్రాహ్మణపల్లి హైస్కూల్‌ సమీపంలోని కరాలపాడు, బ్రాహ్మణపల్లి హైవే జంక్షన్‌ వద్దకు ద్విచక్రవాహనం హైవే రోడ్డుపై పిడుగురాళ్ల రోడ్డు వైపు దాటుతుండగా దాచేపల్లి వైపు వెళ్తున్న లోడ్‌ లారీ ఒక్కసారిగా వచ్చి ఢీకొనటంతో ద్విచక్రవాహనంపై నుంచి రోడ్డుపై పడటంతో అక్కడిక్కడే హుస్సేన్‌ మృతి చెందాడు. ద్విచక్ర వాహనం పెట్రోల్‌ ట్యాంక్‌ నుంచి పెట్రోల్‌ లీకై పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ ఎం.మోహన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు పెట్టి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేశారు.

ఉద్యాన, మిరప పంటల్లో నష్టంపై అధ్యయనం

నాదెండ్ల: మురసు తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో వివిధ రకాలైన ఉద్యాన, మిరప పంటలకు జరిగిన నష్టం వివరాలను శాస్త్రవేత్తల బృందం శుక్రవారం పరిశీలించింది. నాదెండ్ల మండలం తూబాడు, నాదెండ్ల గ్రామాల్లో లాంఫాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.నాగేంద్రరెడ్డి, డాక్టర్‌ గంగాధరరావు, ఉద్యాన శాఖాధికారి శ్రీలక్ష్మి పరిశీలించారు. వెదురు కర్రలతో నిర్మించిన కూరగాయల పందిళ్లు, అరటి, నిమ్మ తోటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. రైతులకు పలు రకాల సూచనలు చేశారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి ఐ వెంకట్రావు మాట్లాడుతూ తుపాను వలన పంటలు నష్టపోయిన రైతులకు, ఉద్యాన పంటలు సాగు చేసుకునేందుకు పలు రాయితీలు అమల్లో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement