పోస్టర్ ఆవిష్కరించిన డీపీటీఓ
నరసరావుపేట: ఆర్టీసీ పార్సిల్ బుకింగ్ సేవలను క్యూఆర్ కోడ్ సహాయంతో వినియోగించుకోవాలని ఆ సంస్థ జిల్లా రవాణా అధికారి(డీపీటీఓ) జి.అజితకుమారి వినియోగదారులను కోరారు. ఈ మేరకు స్థానిక డిపో కార్యాలయంలో క్యూఆర్ కోడ్ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. దీని ద్వారా లాజిస్టిక్ పార్సిల్, కొరియర్ సేవలు మరింత వేగంగా, సులభతరం చేసేందుకు వీలవుతుందన్నారు. పార్సిల్ పంపేవారు, స్వీకరించే వారు క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌లో స్కాన్‌చేసి పేరు, చిరునామా, నంబరును నమోదుచేసి కనఫర్మ్ బుకింగ్ బటన్ నొక్కగానే వివరాలతో కూడిన కోడ్ నంబరు వస్తుందని, కార్గో కౌంటర్‌లో అకౌంట్ నంబరు చూపితే సమయం వృథా కాకుండా పార్సిల్ బుకింగ్ జరుగుతుందన్నారు. డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.


