గురజాలలో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

గురజాలలో ప్రజాస్వామ్యం ఖూనీ

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

గురజాల రూరల్‌: గురజాలలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తూ, అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగితే, ఇచ్చిన హామీలపై ప్రజలు ఎండగడతారని అందుకే అన్ని చోట్లా ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. పోలీసులను వాడుకుని వారికి డబ్బులు ఇచ్చి ప్రతి పక్ష పార్టీ నాయకులను కూడా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారన్నారు. గత ఎన్నికల్లో ఇస్తామన్న ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతితోపాటు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రతి ఇంటికి ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసిందే కాకుండా ఈ విధంగా వచ్చే డబ్బులు కూడా పేదలకు అందకుండా చేశారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలు లేకుండా చేసుకోవడం ఏమిటని కొందరు టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారని కాసు వెల్లడించారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా వేముల శేషమ్మకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కూటమి పాలనపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), బీసీ విభాగం జిల్లా నాయకుడు సిద్దాడపు గాంధీ, మాజీ ఎంపీపీ కొమ్మినేని బుజ్జి, మాజీ జెడ్పీటీసీ ఆరికట్ల శ్రీనివాసరెడ్డి, వేముల చలమయ్య, షేక్‌ పీర్‌ అహ్మద్‌; శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement