పక్షవాతం వస్తే ప్రతి నిమిషం అమూల్యమే | - | Sakshi
Sakshi News home page

పక్షవాతం వస్తే ప్రతి నిమిషం అమూల్యమే

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

నరసరావుపేట: ప్రపంచ స్ట్రోక్‌ డేను గురువారం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది లెక్కలో ప్రతి ఒక్క నిమిషం (ఎవిరీ మినిట్‌ కౌంట్స్‌) అనే సందేశంతో స్ట్రోక్‌డేను పాటిస్తున్నారు. మెదడుకు వచ్చే స్ట్రోక్‌ల ద్వారా మరణాలు, పక్షవాతం, కోమాలోకి జారిపోవటం లాంటివి తప్పించుకునేందుకు వెంటనే నిమిషం కూడా ఆలస్యం కాకుండా సమీపంలోని డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తుంది. గత 20ఏళ్ల నుంచి వరల్డ్‌ స్రోక్‌ ఆర్గనైజేషన్‌ ఈ ప్రచారం నిర్వహిస్తుంది. మెదడు స్ట్రోక్‌ వస్తే మొఖంలో ఒకవైపు ఆచేతనంగా మారటం, ఒక చేయి బలహీనంగా మారటం, మాట సరీగా రాకపోవటం లాంటి లక్షణాలు ఏర్పడతాయి. ఈలక్షణాలు కన్పించగానే వెంటనే ఎమర్జన్సీ సర్వీసులకు తెలియచేసి సమీపంలోని డాక్టర్లను చేరుకోవటం ద్వారా కొంతమేర రికవరీ కావొచ్చు. నేటి ఆధునిక వైద్య విధానంలో మెదడు స్ట్రోక్‌ల నుంచి రికవరీ అయ్యేందుకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని డాక్టర్లు తెలియచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement