తుఫాన్‌ వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

నవ్యాంధ్రప్రదేశ్‌ రైతుకూలీ సంఘం కన్వీనర్‌ మన్నవ హరిప్రసాద్‌

లక్ష్మీపురం: రాష్ట్రంలో ఉత్తర కోస్తా అనాదిగా వెనుకబడి ఉందని నవ్యాంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం కన్వీనర్‌ మన్నవ హరిప్రసాద్‌ పేర్కొన్నారు. గుంటూరులోని సంఘ కార్యాలంయలో బుధవారం ఆయన మాట్లాడుతూ దక్షిణ కోస్తాలో ప్రకాశం, పల్నాడు, మార్కాపురం జిల్లాలు ఎప్పుడు అనావృష్టి, అతివృష్టికి గురవుతున్నాయన్నారు. అకాలంగా అర్నబ్‌ తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో రైతాంగం తీవ్ర నష్టానికి గురయ్యారన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి మంచి శనగలు, మొక్కజొన్న, పొగాకు పంటలకు అస్థిరమైన ధర ఉందని, పాలకులు పట్టించుకోవడం మానేశారన్నారు. తుఫాన్‌ వల్ల ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ పంట నష్టం తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం గ్రామాల వారీగా పంట నష్టాన్ని సర్వే చేసి ఎకరాకి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి తక్షణం ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ఉచిత రేషన్‌ అందజేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement