చిలకలూరిపేటలో అరాచక పర్వం | - | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేటలో అరాచక పర్వం

Oct 23 2026 7:12 AM | Updated on Oct 23 2026 7:12 AM

చిలకలూరిపేట: కిడ్నాప్‌, దాడులు, హౌస్‌ అరెస్టులు మధ్య మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం బుధవారం కొనసాగింది. ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించాల్సిన అధికారులే అధికారపార్టీకి నిస్సిగ్గుగా కొమ్ముకాశారు. బుధవారం ఉదయమే వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీమంత్రి విడదల రజినిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఆమె బయటకు రాకుండా ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. 18వార్డు అభ్యర్థి బండిరాణిని టీడీపీ వర్గీయులు కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లిన సంఘటన కలకలం సృష్టించింది. మరోవైపు బీ ఫారాలు అందజేసేందుకు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్‌పై టీడీపీ వర్గీయులు మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్వో సమక్షంలో దాడికి పాల్పడ్డారు. ఆయనతోపాటు ఉన్న న్యాయవాది, 47 వార్డు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బెల్లంకొండ నరేంద్రచౌదరిపై దాడికి పాల్పడంతో ఆయన స్పృహతప్పి పడిపోయాడు. ఆయనను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్‌ సీపీ మూడో వార్డు అభ్యర్థికి సంబంధించిన బీ ఫారంను కందుల శ్రీకాంత్‌, బెల్లంకొండ నరేంద్రచౌదరి వద్ద నుంచి లాక్కోని టీడీపీ వర్గీయులు చించివేశారు. ఈ తతంగం మొత్తం ఎన్నికల అధికారులు, పోలీసుల సమక్షంలోనే కొనసాగింది. పట్టణంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవితో పాటు 48 వార్డు కౌన్సిలర్‌ పదవులు ఉండగా అందులో బలవంతంగా వైఎస్సార్‌ అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహరింపచేశా రు. ఈ నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం గడువు సమయమైన మధ్యాహ్నం 3గంటల తర్వాత ఎక్కువ శాతం కొనసాగింది. గడువు సమయానికి ముందు కేవలం నాలుగు నామినేషన్లు వైఎస్సార్‌సీపీవి ఉపసంహరించుకోగా మూడు గంటల తర్వాత 12 నామినేషన్లు రాత్రి 10 గంటలు దాటాక కూడా కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement