బైక్‌ ఢీకొని మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని మహిళ మృతి

Oct 23 2026 7:12 AM | Updated on Oct 23 2026 7:12 AM

ఆర్‌డీఓ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన

యడ్లపాడు: జాతీయ రహదారి దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన యడ్లపాడు సుగాలికాలనీ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కాలనీకి చెందిన శ్రావణిబాయి (27) స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తోంది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆమె.. కాలనీ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న హైవేఅంబులెన్స్‌ సిబ్బంది బాధితురాలిని చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనచోదకుడికి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువతి దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా రామకృష్ణాపురం, దేవరాయబొట్లపాలేనికి చెందిన కల్యాణం రాజేష్‌ (30) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగ విధుల్లో భాగంగా రెండు రోజుల క్రితం విజయవాడ వచ్చాడు. ఈ నెల 19వ తేదీన బీసెంట్‌ రోడ్డులోని ఓ మార్ట్‌ వద్ద క్రెడిట్‌ కార్డు క్యాంపెయిన్‌లో ప్రకాశం జిల్లా కెల్లంపల్లి, పలుకురాల తండాకు చెందిన నలావత్తు సంధ్యాబాయి(21)తో రాజేష్‌కు పరిచయం ఏర్పడింది. అదే రోజు రాత్రి 8:30 గంటల సమయంలో భవానీపురంలో సంధ్యాబాయికి తెలిసిన ఒక వ్యక్తికి క్రెడిట్‌ కార్డు అందజేసేందుకు రాజేష్‌తో కలిసి ఆమె బైక్‌పై బయలుదేరింది. కాళీమాత గుడి ఎదురుగా వచ్చేసరికి వెనుక వైపు నుంచి బస్టాండ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108లో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున సంధ్యాబాయి మృతి చెందింది. రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అన్ని చోట్లా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైందని, ఆర్‌డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లాతో కలిసి బుధవారం పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి ఎన్నికల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

నామినేషన్‌ వేయకుండానే వెనుదిరిగిన స్వతంత్ర అభ్యర్థి

నరసరావుపేట: దాచేపల్లి జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషనన్‌ దాఖలు చేసేందుకు నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిన తాను అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా నామినేషన్‌ వేయకుండానే వెనుదిరిగినట్లు జక్కుల వీరాస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement