పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 పింఛన్లకూ తమ్ముళ్ల వసూళ్లు సత్తెనపల్లి: కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా అసలు పింఛను విషయమే మరిచి పోయారు. స్థానిక సంస్థలకు సంబంధించి మున్సిపల్‌, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతుండడంతో వారి ఓట్లు రాబట్టేందుకు పింఛన్‌ రాగం అందుకున్నారు. ప్రభుత్వం పింఛన్లు మంజూరుకు ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం, వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఈ నెల 18వ తేదీ వరకు గడువు పెంచింది. అనంతరం వెబ్‌సైట్‌ క్లోజ్‌ చేసింది. చంద్రబాబు పింఛను ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని చూస్తే .. జిల్లాలో కూటమి నేతలు కొందరు అందిన కాడికి దండుకుంటున్నారు. పోటీ చేయాలనే ఆలోచన ఉన్న మరి కొందరు ‘పింఛన్‌ మంజూరు చేయిస్తాం .. నాకే ఓటేయాలంటూ’ హామీలు తీసుకుంటున్నారు. బేరసారాలకు దిగి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దరఖాస్తులు ఇలా.. జిల్లాలో ఈ నెల 7 నుంచి 18వ తేదీ వరకు సామాజిక పింఛన్ల కోసం 61,374 మంది సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 7,384 దరఖాస్తులను ఆమోదించారు. 325 దరఖాస్తులను తిరస్కరించారు. 23,478 దరఖాస్తులు సచివాయాల వెల్ఫేర్‌ సెక్రటరీల వద్ద, 27,377 దరఖాస్తులు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల వద్ద, 2,376 దరఖాస్తులు సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీర్ల వద్ద, 67 దరఖాస్తులు ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల వద్ద, 101 దరఖాస్తులు హ్యండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల వద్ద, 159 దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద, 107 దరఖాస్తులు జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీలోగా పరిశీలన పూర్తి చేసి ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్‌కు పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎంపీడీవోలు, కమిషనర్లపై ఒత్తిళ్లు ప్రస్తుతం సామాజిక పింఛన్ల దరఖాస్తులు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్‌కు చేరుకుంటున్నాయి. కూటమి నేతలు వారిపై ఒత్తిడికి యత్నిస్తున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వాటిని ఆమోదించి ఈ నెల 24వ తేదీలోపు నేరుగా సెర్ప్‌ సీఈఓకు పంపించాల్సి ఉంది. సామాజిక పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారనేది మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. పింఛన్లు ఎప్పుడు మంజూరవ్వుతాయోనని ఆభాగ్యులు ఎదురు చూస్తున్నారు. మరికొందరు సర్టిఫికెట్లు సకాలంలో అందక, మ్యాపింగ్‌ ఇబ్బందుల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇప్పటికీ అధికారులు, కూటమి నేతలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

నకిలీ సదరం సర్టిఫికెట్లతో...

పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించగానే కూటమి నాయకులు రంగంలోకి దిగారు. పట్టణాల్లోని వార్డుల్లో, గ్రామాల్లో అభాగ్యులను లక్ష్యంగా చేసుకొని డబ్బు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌ అవసరం కానుండగా .. వారి నుంచి ఒక్కో సర్టిఫికెట్‌ కోసం రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు కొందరు తీసుకున్నారు. ఫేక్‌ అయినప్పటికీ ‘అవన్నీ మేం చూసుకుంటాం! మీకెందుకు, మీరు ఆన్‌లైన్‌ చేయండి’ అంటూ స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాల వెల్ఫేర్‌ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు వారు చేసేదేమీ లేక ఆన్‌లైన్‌ చేశారు. ఇదిలా ఉంటే సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పింఛన్‌ దరఖాస్తు చేసేందుకు ఎవరు వచ్చినా తన వద్దకే పంపాలని సచివాలయ ఉద్యోగులకు హుకుం జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

సాగర్‌ నీటిమట్టం

గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
పింఛన్లకూ తమ్ముళ్ల వసూళ్లు

దరఖాస్తుదారులతో

దర్జాగా బేరసారాలు

జిల్లా వ్యాప్తంగా పింఛన్లకు

61,374 దరఖాస్తులు

ఎంపీడీవోలు, కమిషనర్ల

లాగిన్‌లో దరఖాస్తులు

సర్టిఫికెట్లు అందక దరఖాస్తు

చేయలేని అర్హులు

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 535.80 అడుగులకు చేరింది. ఇది 179.6902 టీఎంసీలకు సమానం.

వారు ఆసరా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసే అభాగ్యులు. సామాజిక పింఛన్లు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. పింఛన్‌ దరఖాస్తుకు అవసరమైన సర్టిఫికెట్లు జాప్యం లేకుండా ఇప్పించేందుకు, సదరం సర్టిఫికెట్లు, దరఖాస్తులు సకాలంలో సచివాలయంలో ఆన్‌లైన్‌ చేయించేందుకు కొందరు కూటమి నేతలు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరైతే రూ. 5 వేలు స్పాట్‌లో ఇస్తే పింఛను మంజూరు చేయిస్తానంటూ అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించి దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు పింఛన్‌ మంజూరు చేయించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటెయ్యాలంటూ ఆశావాహులైన నేతలు ఒత్తిడి తెస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement