రెడ్‌బుక్‌ వేధింపులు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ వేధింపులు

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

రెడ్‌బుక్‌ వేధింపులు తప్పుడు కేసులు... అక్రమ అరెస్ట్‌కు యత్నాలు సత్తెనపల్లి: ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలపటం ప్రజల హక్కు. డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై నిరుద్యోగులకు అండగా వైఎస్సార్‌ సీపీ పోరుబాట పట్టింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టి అధిక మార్కులు సాధించిన నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ నేతలు ఆవేదన వెలిబుచ్చారు. పోస్టులను డబ్బులకు అమ్మేశారంటూ ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలకు సాక్ష్యాధారాలు చూపినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 21న విజయవాడ శాప్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఇది గమనించిన విద్యాశాఖ మంత్రి లోకేష్‌ తన యువగళం మూకలు, దొడ్డి దారిన పరీక్షే రాయకుండా ఉద్యోగాలు పొందిన అనుచరులను, టీడీపీ గూండాలను శాప్‌ కార్యాలయంలో ఉంచి వైఎస్సార్‌ సీపీ శ్రేణులపైకి ఉసి గొలిపారు. శాంతియుత నిరసనను భగ్నం చేసేందుకు యత్నించినప్పటికీ వైఎస్సార్‌ సీపీ నేతలు సమర్థంగా ఎదుర్కొని ధర్నా నిర్వహించారు. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం.. ‘గురువులపై దాడి చేశారంటూ’ వైఎస్సార్‌ సీపీపై విమర్శలు చేసింది. ఇంకేముంది ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం విజయవాడ మాచవరం పోలీసులు వెంటనే వైఎస్సార్‌ సీపీ కీలక నేతలను టార్గెట్‌ చేసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. వీడియోల ఆధారంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేటలో వివరాలు సేకరిస్తూ అక్రమ అరెస్టులకు ప్రయత్నిస్తున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుకు పోలీసులు అడుగడుగునా సహకరిస్తున్నారు.

గజ్జల గృహంలో అర్ధరాత్రి తనిఖీలు...

వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి గృహంలో, వైద్యశాలలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు. డాక్టర్‌ సుధీర్‌ భార్గవ్‌రెడ్డి గృహంలో ఆయన తండ్రి డాక్టర్‌ బ్రహ్మరెడ్డి, తల్లి, భార్య మాత్రమే ఉన్నప్పటికీ అన్ని గదులలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆఖరికి బెడ్‌రూమ్‌ అని చెప్పినా వినిపించుకోకుండా తనిఖీలు చేయడం చూస్తుంటే పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. అంతేగాక శాప్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ కీలక నేతలందరిపై అక్రమ కేసులు బనాయించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు పార్టీకి సహకారం అందించే అవకాశం లేకుండా బైండోవర్‌ చేయాలనే దురుద్దేశంతో ఇలా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తప్పుడు కేసులు... అక్రమ అరెస్ట్‌కు యత్నాలు

శాప్‌ కార్యాలయం ఎదుట

ధర్నా ఘటనపై తాజాగా కేసులు

డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి

ఇంటిలో అర్ధరాత్రి తనిఖీలు

వీడియోల ఆధారంగా వైఎస్సార్‌ సీపీ

శ్రేణులే లక్ష్యంగా వేధింపులు

డీఎస్సీ అక్రమాలు ప్రశ్నించే వారిపై

చంద్రబాబు సర్కార్‌ అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement