● జిల్లా సంయుక్త కలెక్టర్
సంజనా శ్రీ హర్ష
● పీజీఆర్‌ఎస్‌లో 180
అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహ రిస్తూ ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించా లని జిల్లా సంయుక్త కలెక్టర్ సంజనా శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి పలువురు జిల్లా అధికారులతో కలిసి 180 అర్జీలు స్వీకరించారు. అందులో రెవెన్యూ క్లినిక్‌కు 22 అర్జీలురాగా గురజాల డివిజన్ నుంచి ఏడు, సత్తెనపల్లి 8, నరసరావుపేట ఏడు ఉన్నాయి. జిల్లాలో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.


