న్యూస్‌రీల్
పింఛన్లు మంజూరు చేయండి మహాప్రభో అని ఎన్నోసార్లు కార్యాలయాల చుట్టూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తిరిగినా చంద్రబాబు ప్రభుత్వం ఇంతకాలం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా కొత్త పింఛన్ల మంజూరు ఊసెత్తని ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. దరఖాస్తు చేసుకోవాలని ఆశలు రేపింది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకు అర్హులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు తెలుగు తమ్ముళ్లు వసూళ్లకు తెరలేపారు. బెదిరింపులు, ఆన్‌లైన్ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు.


