జిల్లా పోలీసు కార్యాలయంలో రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

జిల్లా పోలీసు కార్యాలయంలో రక్తదాన శిబిరం

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

నరసరావుపేట రూరల్‌: జిల్లా పోలీసు కార్యాలయలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా రెడ్‌క్రాస్‌ సహకారంతో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో అదనపు ఎస్పీ రక్తదానం చేశారు.ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. విధి నిర్వహణలో దేశం కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అమరవీరుల స్పూర్తిని కొనసాగిస్తూ సమాజ సేవలో భాగంగా రక్తదానం చేయడం గొప్ప కార్యక్రమమని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, వెల్పేర్‌ ఆర్‌ఐ గోపినాథ్‌, హోంగార్డు ఆర్‌ఐ ఎస్‌.కృష్ణ, ఎంటీ ఆర్‌ఐ యువరాజ్‌, బీడీ టీం ఆర్‌ఐ ఎం.రాజా, జిల్లా రెడ్‌ క్రాస్‌ అధ్యక్షుడు ఎంవి శేషగిరిరావులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement