ఆటో నుంచి జారిపడి వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో నుంచి జారిపడి వృద్ధుడు మృతి

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

ప్రైవేట్‌ ఆస్పత్రిలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు?

యడ్లపాడు: ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడికి పిట్స్‌ రావడంతో కిందపడిపోయి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..గుంటూరు నుంచి యడ్లపాడు వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వంకాయలపాడు గ్రామాన్ని దాటిన అనంతరం సర్వీస్‌ రోడ్డులోకి చేరింది. అదే సమయంలో ఆటోలో డోర్‌ వైపు కూర్చొని ఉన్న యడ్లపాడు గ్రామం దళితవాడకు చెందిన తుమ్మపూడి సుబ్బారావు(64) పిట్స్‌ రావడంతో జారీ కిందపడ్డారు. హైవే సర్వీస్‌ మార్గం వెంట నిర్మించిన కాలువ దిమ్మెకు తల బలంగా తగిలింది. గమనించిన ఆటో డ్రైవర్‌ షఫరుద్దీన్‌ ఇచ్చిన సమాచారం మేరకు కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వ్యక్తిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు నాయుడుపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, విధులు ముగిశాక ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

పిడుగురాళ్ల: పట్టణంలోని ఓ ప్రైవేట్‌ శుక్రవారం విజిలెన్‌న్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్‌పై పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ నుంచి జిల్లా కలెక్టర్‌కు సమాచారం రావడంతో కలెక్టర్‌ ఆదేశాలతో మెడికల్‌ టీం అవసరమని డీఎంహెచ్‌ఓకు లెటర్‌ రావడంతో ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కలసి టీంగా ఏర్పడి హాస్పిటల్‌లో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించడంతోపాటు పనితీరు పరిశీలించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీలు, సీఐలతోపాటు మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి పల్నాడు జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రత్న మనోహర్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓలతోపాటు పలువురు అధికారులు హాజరైనట్లు తెలిపారు. పరిశీలించిన రికార్డులు, హాస్పిటల్‌కి సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని తెలిపారు.

మహిళపై కత్తితో దాడి

చిలకలూరిపేటటౌన్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలో జరిగింది. అర్బన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బొందిలిపాలేనికి చెందిన రాజవరపు మల్లేశ్వరి ఎన్‌్‌ఆర్‌టీ సెంటర్‌లోని ఓ భోజన హోటల్‌లో క్లీనింగ్‌ పనులు చేస్తూ జీవిస్తోంది. భర్త కొద్దికాలం కిందట చనిపోయాడు. అదే హోటల్‌ సమీపంలోని ఓ లాడ్జిలో కర్నూలు జిల్లాకు చెందిన కొప్పుల శ్రీనివాసరావు కొద్దికాలంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆమెను తనతో వచ్చేయాలని బలవంతం చేయసాగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో రెండుసార్లు ఘర్షణ పడ్డాడని, పక్కా వ్యూహంతో శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వచ్చి కూరగాయల కత్తితో దాడి చేసి ఒంటిపై పలుచోట్ల గాయాలు చేసినట్లు తెలిపారు. సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ పి రమేష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని, అయితే దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య

క్రోసూరు: భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక వివాహిత ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వేకువజామున జరిగింది. ఎస్‌ఐ పి.రవిబాబు తెలిపిన వివరాల మేరకు అమరావతి మండలంలోని తురగావారిపాలెం గ్రామానికి చెందిన బంకాశ్రీలేఖ(21)కు నాలుగున్న సంవత్సరాల కిందట ఊటుకూరులోని బంకా మాణిక్యరావుతో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఏదో కారణంగా తన కుమార్తెను వేధిస్తున్నారని, దీంతో మనస్థాపం చెంది ఉరేసుకుని మృతి చెందిందని మృతురాలి తండ్రి రామకోటేశ్వరరావు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతురాలికి కుమార్తె ఉన్నట్లు తెలిపారు. దీనిపై భర్త, అత్తమామల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement