న్యూస్‌రీల్
ఎంపీటీసీలు
పులిచింతల సమాచారం
పల్నాడు
శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● ఎంపీటీసీలకు 23న, జెడ్పీటీసీలకు
24న ముగియనున్న పదవీ కాలం
● నేడు ఫొటో ఓటర్ల జాబితా విడుదల
చేయనున్న అధికారులు
సత్తెనపల్లి: జిల్లాలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తొలుత ఫొటో ఓటర్ల జాబితాలను ప్రకటించడానికి సమాయత్తం అవుతున్నారు. ఫొటో ఓటర్ల జాబితాలను ప్రకటించనున్నారు. ప్రజల పరిశీలనార్థం ఈ జాబితాలను ప్రకటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2021వ సంవత్సరంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీల పదవీ కాలం ఈ నెల 23న, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24న ముగియనుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి చర్యలు చేపట్టింది.
జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని 28 మండలాల్లో 425 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. అంతేగాక మండలానికి ఒకరు చొప్పున 28 మంది ఎంపీపీలు ఎన్నిక కానున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త జిల్లా పరిషత్‌లు అమల్లోకి వస్తాయి. ఈ నెల 20వ తేదీ తర్వాత అధికారులను నియమించే అవకాశం ఉంది. ఉద్యోగుల సమాచారం, వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. జనాభా దామాషా ప్రకారం జెడ్పీకీ సిబ్బందిని కేటాయించనున్నారు.
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఈ నెల 11న ప్రచురించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు జాబితా లను ప్రజల పరిశీలనార్థం ప్రచురించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధమే అనే రీతిలో యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాత ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తదితర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ అధికారులు పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. తొలగించాల్సిన ఓట్లు ఎలా కొనసాగిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
జిల్లాలో గ్రామీణ ఓటర్ల జాబితా ప్రచురణకు ఎంపీడీఓలు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని 28 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలవారీగా రూపొందించి, ఓటర్ల ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్‌కు ముందున్న వివరాల మేరకు ఓటర్ల ముసాయిదా జాబితాను శుక్రవారం జిల్లాలోని 28 మండలాల్లో గల గ్రామాల్లో విడుదల చేయనున్నారు. ప్రజల పరిశీలనార్థం నోటీస్ బోర్డుల్లో అతికించనున్నారు.


