కామేపల్లి మెడికల్ కాలేజీలో ఇంకా పూర్తికాని పనులు
అక్టోబర్ ఒకటి నుంచి వైద్య కళాశాల తరగతులు
వసతులు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికత..
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోవాల్సిన ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీ ప్రారంభ దశలోనే సమస్యల వలయంలో చిక్కుకుంది. కనీస మౌలిక వసతులు లేకుండానే ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం పలకాల్సిన దుస్థితి నెలకొది. అక్టోబర్ 1 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్న తరుణంలో, క్షేత్ర స్థాయి పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. కనీస వసతులు కల్పించకుండానే హడావుడిగా తరగతులు ప్రారంభిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి
రంగుల మార్పుపైనే కూటమి శ్రద్ధ
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన ఈ నిర్మాణ పనులు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా నత్త నడకన సాగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా.. కాలేజీలో తరగతి గదులు, ల్యాబ్ మిగిలినవి అసంపూర్తిఉన్నాయి. పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యార్థుల చదువుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై దష్టి పెట్టని ప్రభుత్వం, కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం వేసిన రంగులను మార్చడంలోనే సమయం వథా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమస్యలు ఇవీ..
హాస్టల్ సమస్యతో విద్యార్థులకు అభద్రతాభావం
కాలేజీల్లో చదువు సంగతి పక్కన పెడితే, రాష్ట్రంలోని నలుమూలల నుంచీ, ఇతర ప్రాంతాల నుంచీ కామేపల్లి కాలేజీకి వచ్చే విద్యార్థుల బాయ్స్, గర్‌ల్స్ హాస్టళ్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. వసతి గృహాలు సిద్ధం కాకుండానే తరగతులు ప్రారంభం అంటే, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదంటున్నారు.
స్పందించాలని వినతి
క్షేత్రస్థాయిలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి.. కామేపల్లి మెడికల్ కాలేజీలో ల్యాబ్‌లు, హాస్టళ్లు, ఇతర మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విద్యావర్గాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సెమినార్ రూమ్ ను స్టోర్ రూమ్ గా మార్చారు పరికరాలు అమర్చని హిస్టాలజీ ల్యాబ్
రాష్ట్రంలో వైద్య రంగాన్ని విప్లవాత్మకంగా మార్చాలని, పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను చేరువ చేయాలన్న గొప్ప సంకల్పంతో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ దార్శనికతకు అనుగుణంగా, పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారు. ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని భూసేకరణ నుంచి పనుల ప్రారంభం, నిర్మాణం వరకు ప్రతి దశలోనూ పర్యవేక్షించడంతో, అప్పట్లోనే ఈ కాలేజీ నిర్మాణం 60 శాతానికి పైగా శరవేగంగా పూర్తయింది.


