పెన్షన్‌.. టెన్షన్‌! | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌.. టెన్షన్‌!

Sep 10 2026 1:45 AM | Updated on Sep 10 2026 1:45 AM

గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 పెన్షన్‌.. టెన్షన్‌! నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం పీఆర్‌సీ బకాయిలు వెంటనే చెల్లించాలి

గంటల తరబడి పడిగాపులు...

న్యూస్‌రీల్‌

కొత్త పింఛన్లకు అలవికాని ఆంక్షలు అర్హులకు తీవ్ర ఇబ్బందులు 16 వరకే దరఖాస్తుల స్వీకరణ మధ్యలో మూడు రోజులు సెలవులు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలలో సర్వర్‌ డౌన్‌ కష్టాలు సర్టిఫికెట్ల కోసం అడుగడుగునా తప్పని అవస్థలు సచివాలయాల వద్ద గంటల తరబడి దరఖాస్తుదారుల పడిగాపులు

పల్నాడు
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
కొత్తగా పింఛన్ల మంజూరుకు రెండున్నరేళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు. ఎట్టకేలకు అవకాశం కల్పించారనుకుంటే సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. అర్హులకు చుక్కలు చూపిస్తున్నారు. దరఖాస్తుకు గడువు తక్కువగా ఇచ్చి.. వివిధ సర్టిఫికెట్ల పేరుతో ఆందోళనకు గురిచేస్తున్నారు. పత్రాలు తీసుకువస్తే సర్వర్‌ డౌన్‌.. అంటూ బయటకు తరిమేస్తున్నారు. చిన్నపాటి తప్పులు ఉన్నాయని సాకులు చెప్పి మార్చుకుని రావాలని పంపుతున్నారు. పింఛన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఓ ప్రహసనంగా మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

7

తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.9 వేలు, గరిష్ఠ ధర రూ.13 వేలు, మోడల్‌ ధర రూ.10 వేల వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 534.90 అడుగులకు చేరింది. ఇది 177.8698 టీఎంసీలకు సమానం.

ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్‌

పిడుగురాళ్ల రూరల్‌: హక్కుగా రావాల్సిన పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్‌ చేసింది. సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీలో వైద్యులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జనరల్‌ సెక్రటరీ వైకేసీ రంగయ్య మాట్లాడుతూ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. కొత్త పే కమిషన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, సైకాలజీ, హెల్త్‌ సర్వీసెస్‌ పరిధిలోని వైద్యులకు టైమ్‌ బౌండ్‌ పే స్కేల్స్‌ను వర్తింపజేయాలని అన్నారు. వైద్యులకు రావాల్సిన పెండింగ్‌ డీఏ అరియర్స్‌ను వెంటనే చెల్లించాలని అన్నారు. అర్హులైన అన్ని విభాగాల్లోని వైద్యులకు నాన్‌–ప్రాక్టీసింగ్‌ అలవెన్స్‌ను అమలు చేయాలని తెలిపారు. సీనియారిటీ ప్రాతిపదికన వైద్యులకు ఎప్పటికప్పుడు సకాలంలో ప్రమోషన్లు కల్పించాలని పేర్కొన్నారు. వైద్యులు ఎదుర్కొంటున్న ఆర్థిక, సర్వీసు సంబంధిత సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్లపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. లేకుంటే తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ బాబు, వైద్యులు సత్యనారాయణ, మనోజ్‌ రాజ్‌, భాను ప్రకాష్‌, త్రినాథ్‌, విజయలక్ష్మి, దేవసేన, సునీత,రాజేష్‌, విద్యాసాగర్‌, విక్టర్‌ పాల్‌, వెంకటేష్‌,సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ల దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ధ్రువీకరణ సమస్యలు లబ్ధిదారుల ఆశలను ఆందోళనగా మారుస్తున్నాయి. ఒకవైపు దరఖాస్తులకు గడువు తక్కువగా ఉండటం.. మరోవైపు ఆన్‌లైన్‌ ప్రక్రియలో అవరోధాలు ఎదురవుతుండటంతో దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. కొత్త పింఛన్లు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్‌ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గంటల తరబడి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొత్త పింఛన్‌ దరఖాస్తుకు ఈ నెల 16వ తేదీనే చివరి గడువుగా నిర్ణయించారు. ఈ కొద్దిరోజుల వ్యవధిలోనే శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు. మిగిలిన అతి కొద్ది రోజుల్లోనైనా దరఖాస్తు చేసుకుందామంటే సర్వర్లు మొరాయిస్తున్నాయి. వయసు మీద పడిన వారు, శారీరక ఇబ్బందులతో ఉన్న దివ్యాంగులు గంటల తరబడి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం వస్తే సాయంత్రం వరకు పని పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

సత్తెనపల్లి: జిల్లాలోని అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన కొత్త పింఛన్ల ప్రక్రియ నరకప్రాయంగా మారింది. ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించామని ఘనంగా డప్పు కొట్టుకుంటోంది. అయితే క్షేత్రస్థాయిలో సవాలక్ష కొర్రీలతో పేదలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఒకవైపు స్వల్ప గడువు, మరోవైపు సాంకేతికంగా సర్వర్‌ మొరాయింపు సమస్యలు, ఇంకోవైపు నిర్లక్ష్యంతో అర్హులైన పేదలు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 645 స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో గత రెండు రోజుల్లో కొత్త పింఛన్లకు 2,405 దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

‘తమ్ముళ్ల’ దోపిడీ..

పింఛన్‌ దరఖాస్తుకు కావలసిన సదరం, ఆదాయ, కుల ధ్రువీకరణ, ఆధార్‌ ఐడెంటిఫికేషన్‌, ఓటర్‌ కార్డు, ఇతర పత్రాల మంజూరులో అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సర్టిఫికెట్ల మంజూరు పేరుతో కొందరు తెలుగు తమ్ముళ్లు దళారులుగా మారి అందినకాడికి దోచుకుంటున్నారు. క్లిష్ట సమయాన్ని అదునుగా చూసుకుని డబ్బులు ఇస్తేనే పని అవుతుందని తేల్చి చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీ పెట్టించి తిరస్కరింపజేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లిలో దివ్యాంగులు కాని వారికి తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాలతో కూడిన సదరం సర్టిఫికెట్లను పెట్టి పింఛన్‌ మంజూరు చేయిస్తామంటూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కులం సర్టిఫికెట్‌ దేనికి?

పింఛన్‌ మంజూరు కోసం కూడా కుల ధ్రువీకరణ పత్రం అడుగుతుండడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే పింఛన్‌కు కులానికి ఏం సంబంధం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంటి పన్నుకు సంబంధించి అసెస్‌మెంట్‌ నంబర్‌ తీసుకురావాలంటున్నారు. అసెస్‌మెంట్‌ నంబర్‌ నమోదు చేస్తేనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం ఈ అసెస్‌మెంట్‌ను తొలగిస్తున్నట్లు తెలిపినా సర్వర్‌లో మాత్రం ఇంకా అప్‌డేట్‌ కాలేదు. దీంతో అసెస్‌మెంట్‌ నంబర్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కరెంట్‌ మీటర్ల షాక్‌

దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారి వివరాలు సచివాలయంలో నమోదు చేసినప్పుడు వారి పేరున రెండు, మూడు, నాలుగు విద్యుత్‌ మీటర్లు ఉన్నట్లు చూపిస్తోంది. నెలకు 300 యూనిట్లు దాటితే పింఛన్లకు అర్హులు కారు. రెండు, మూడు మీటర్లు ఉంటే అంతకుమించి యూనిట్ల వినియోగం జరిగినట్లుగా గుర్తించి అప్‌లోడ్‌ చేసే సమయంలో దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇప్పుడవన్నీ సరిచేసుకొని మళ్లీ అప్‌లోడ్‌ చేద్దామంటే సమయం లేదు. కేవలం నాలుగు పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మళ్లీ దరఖాస్తు చేసుకోవడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సచివాలయానికి వచ్చాక మీటర్ల విషయం తెలియడంతో చాలామంది ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు.

జిల్లా సమాచారం

మండలాలు : 28

పంచాయతీలు : 525

మున్సిపాలిటీలు : 08

స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు : 645

మొత్తం జనాభా : 20.41 లక్షలు

2024 జూన్‌ 1 నాటికి పింఛన్లు : 2,80,568

ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య : 2,66,360

రెండున్నరేళ్లలో

కోతకు గురైన పింఛన్లు : 14,238

గత రెండు రోజులుగా

వచ్చిన దరఖాస్తులు : 2,405

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement