డీఎంహెచ్‌ఓకు కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగుల వినతి
నరసరావుపేట: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ ఉద్యోగులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమ కార్యాచరణకు సహకరించాలని పల్నాడు డీఎంహెచ్‌ఓ డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్‌ను నాయకులు కోరారు. ఈ మేరకు కార్యాలయంలో బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ ఉద్యమ కార్యాచరణ, ప్రధాన డిమాండ్లు, ప్రస్తుత కార్యక్రమాలు, తదుపరి కార్యాచరణ తదితర అంశాలను డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో రోగులకు అందించే వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సహకారం అందించాలని కోరారు. ఆన్‌లైన్ రిపోర్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారన్నారు. జేఏసీ కన్వీనర్ శాంతరాజు, చైర్మన్ బి.నాగరాజకుమారి, పి.శివరామకృష్ణ, సతీష్, నాగేంద్ర, నూర్జహాన్, ఎస్.సురేష్, రేడియోగ్రాఫర్ బి.రాజు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.


