కుంకుమ ప్రభ ఊరేగింపులో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

కుంకుమ ప్రభ ఊరేగింపులో అపశ్రుతి

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

బొల్లాపల్లి: బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామంలో కుంకుమ ప్రభ ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. వర్షాలు కురవాలని గంగమ్మ తల్లికి కుంకుమ ప్రభ ఏర్పాటు చేయగా, ఆ గ్రామానికి చెందిన అరవా ముక్కంటికి చెందిన ఎడ్ల జతను కుంకుమ ప్రభకు కట్టి గ్రామంలో శనివారం రాత్రి 11 గంటలకు ఊరేగింపు ప్రారంభించి, ఊరేగిస్తుండగా తెల్లవారితే ఆదివారం 2.30 గంటల సమయంలో 11కే వీ విద్యుత్‌ లైన్‌ కు చెందిన కరెంట్‌ తీగలు ప్రభకు తగలడంతో షాక్‌కు గురై ఎడ్ల జత అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయని, వీటి ఖరీదు రూ. 3 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విద్యుత్‌ ప్రమాదంలో ప్రభకు సమీపంలో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, మరికొందరు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

విద్యుత్‌ షాక్‌తో ఎడ్ల జత మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement