ఐదు రాష్ట్రాలస్థాయి కరాటే పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఐదు రాష్ట్రాలస్థాయి కరాటే పోటీలు ప్రారంభం

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

దాచేపల్లి: దాచేపల్లిలోని తిరుమల కల్యాణ మండపంలో ఐదు రాష్ట్రాలస్థాయి కరాటే పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. చోటోఖాన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను నగర పంచాయతీ చైర్మన్‌ కొప్పుల సాంబయ్య ప్రారంభించారు. ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి 500మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్‌–12, అండర్‌––14, అండర్‌–18 విభాగాల్లో కరాటే పోటీలు నిర్వహించినట్లు నిర్వహకులు కొప్పుల నరసింహరావు, కొప్పుల పార్వతి తెలిపారు. గ్రాండ్‌ చాంపియన్‌ షిప్‌ తెలంగాణ, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌, మూడవస్థానంలో కర్నాటక రాష్ట్రాలు నిలిచినట్లు వారు వెల్లడించారు. విజేతలైన క్రీడాకారులకు షీల్డ్స్‌, సర్టిఫికెట్లను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement