విద్యార్థులకు ఉపాధ్యాయులే స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఉపాధ్యాయులే స్ఫూర్తి

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

నరసరావుపేట ఈస్ట్‌: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాష్‌నగర్‌లోని టౌన్‌హాల్‌లో శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ కృతికా శుక్లా, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖాధికారులు పాల్గొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 70 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌కు తల్లిదండ్రుల త్యాగంతో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకమని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞాన వికాసంతోపాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, మానవీయత వంటి సద్గుణాలు పెంపొందిస్తూ వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అభిప్రాయపడ్డారు. ప్రతిభ గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణతను 95 శాతం వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీఈ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిభ గల విద్యార్థులను నగదు బహుమతితో ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర శిల్పారామం, సాంస్కృతిక విభాగం సంస్థ చైర్మన్‌ చేరెడ్డి మంజులారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement