క్రెడిట్‌ చోరీనే అంతా | - | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ చోరీనే అంతా

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 క్రెడిట్‌ చోరీనే అంతా

న్యూస్‌రీల్‌

క్రెడిట్‌ చోరీకి యత్నం

వైఎస్సార్‌ సీపీ హయాంలో శరవేగంగా...

సాగర్‌ నీటిమట్టం

పులిచింతల సమాచారం

నిమ్మకాయల ధరలు

పల్నాడు
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

వైఎస్సార్‌ సీపీ హయాంలో

కాకాని జేఎన్‌టీయూఎన్‌కు మహర్దశ

రూ.135కోట్లతో అభివృద్ధి పనులు

రూ.60కోట్లతో విద్యార్థుల వసతి

గృహ నిర్మాణాలు

అంచనాలు పెరగడంతో గత

రెండున్నర ఏళ్లుగా నిలిచిన నిర్మాణాలు

గత ప్రభుత్వ హయాంలోనే

80శాతం పనులు పూర్తి

ప్రస్తుతం సవరించిన

అంచనాలతో రూ.10కోట్లతో పనులు

అవి కూడా పూర్తికాకుండానే నేడు

ప్రారంభించనున్న మంత్రి లోకేష్‌

7

చేసింది

గోరంత..

నరసరావుపేట రూరల్‌: విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకానిలోని జేఎన్‌టీయూఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కళాశాలకు భూమి కేటాయించినా కనీసం ప్రహరీ నిర్మాణం కూడా నాటి టీడీపీ ప్రభుత్వ పూర్తిచేయలేకపోయింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జేఎన్‌టీయూఎన్‌ కళాశాల నిర్మాణాలకు అడుగులు పడ్డాయి. కరోనా సమయంలో కూడా ఇక్కడ పనులు ఆగలేదు. దాదాపు రూ.135కోట్లతో ఇంజినీరింగ్‌ కళాశాల భవనాల నిర్మాణాలను పూర్తిచేసారు. రెండున్నరేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జేఎన్‌టీయూఎన్‌ కళాశాల నిర్మాణాలు నిలిచిపోయాయి. యువతీ, యువకుల వసతి గృహాలకు అవసరమైన రూ.10కోట్లు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు నిధులు మంజూరు చేసి పనులు పూర్తికాకుండానే వసతి గృహ భవనాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ బుధవారం వసతి గృహ భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ.70కోట్లతో వసతి గృహాలు తామే పూర్తిచేసినట్టు కూటమి నేతలు ప్రచారం చేసుకుంటూ క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు.

రెండున్నరేళ్లుగా తీవ్ర ఇక్కట్లు

కూటమి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాటు వసతి గృహాలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జేఎన్‌టీయూ వంటి ప్రతిష్టాత్మకమైన కళాశాలలో చదివేందుకు మెరిట్‌ విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఈ కళాశాలలో కనీసం వసతి గృహాలు లేకపోవడం వారికి ఇబ్బందిగా మారింది. నరసరావుపేటలోని పీజీ హాస్టళ్లలో ఉంటూ ప్రతి రోజు కళాశాలకు వెళ్లిరావడం ఆర్థికంగా భారం అయింది. దీంతో పాటు బస్సులు అందుబాటులో లేకపోవడం ఆటోలపై ఆధారపడటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు.

అసంపూర్తి నిర్మాణాలతోనే ప్రారంభోత్సవం!

మంత్రి నారా లోకేష్‌ బుధవారం కళాశాలలోని వసతి గృహలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసారు. విద్యార్థినీ, విద్యార్థులకు విడివిడిగా నాలుగు బ్లాక్‌ల్లో భవనాలు నిర్మిస్తున్నారు. ఇందులో యువతుల కోసం ఏర్పాటుచేసి గౌతమి, కృష్ణవేణి, నాగార్జున బ్లాక్‌లను మాత్రమే లోకేష్‌ ప్రారంభిస్తారు. నాల్గో బ్లాక్‌ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రూ.10కోట్లతో చేపట్టిన పనులను పూర్తిచేయకుండానే హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాల్గో బ్లాక్‌లో ఇంకా రూ.3కోట్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులు ముందుకు కదటడం లేదు. ఇండోర్‌ స్టేడియంతో పాటు పలు క్రీడలకు సంబంధించిన ప్రాంగణాలను ఇందులో అభివృద్ధి చేయాల్సి ఉంది.

యూనివర్సిటీగా మార్చాలని డిమాండ్‌

వెనకబడిన పల్నాడు ప్రాంతంలో ఉన్న జేఎన్‌టీయూఎన్‌ కళాశాలను యూనివర్సిటీ చేయాలనే ప్రతిపాదన ఉంది. వర్సిటీకి అవసరమైన భూమి కళాశాలలో అందుబాటులో ఉంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఇంజినీరింగ్‌ కళాశాలలు అధికంగా ఉన్నాయి. వర్సిటీలో పనుల కోసం కాకినాడ వెళ్లాల్సి రావడం విద్యార్థులకు భారంగా మారింది. ఇప్పటికే జేఎన్‌టీయూఎన్‌ కళాశాలను అటానమస్‌ చేసిన నేపథ్యంలో వర్సిటీగా ప్రకటించాలని కోరుతున్నారు.

జేఎన్‌టీయూఎన్‌ కళాశాల నిర్మాణంలో ఎటువంటి పాత్ర లేని టీడీపీ నాయకులు ఇప్పుడు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.150కోట్ల మేర కళాశాలలో అభివృద్ధి పనులు నిర్వహించగా అందులో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులు రూ.10కోట్లు మేరకే. ఇందులో కూడా రూ.3కోట్ల మేర పనులు నిర్వహించాల్సి ఉంది. అయినా తమ ఆధ్వర్యంలోనే జేఎన్‌టీయూఎన్‌ కళాశాల నిర్మాణాలు జరిగాయంటూ టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ క్రెడిట్‌ చోరీకి పాల్పడటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కాకానిలోని జేఎన్‌టీయూఎన్‌ కళాశాల నిర్మాణాలను 2016లో ప్రారంభించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం భవనాల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించింది. కళాశాలకు కాకాని వద్ద కేటాయించిన భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.2.5కోట్లు కేటాయించినా ఐదేళ్లలో పూర్తిచేయలేకపోయారు. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భవనాల నిర్మాణాలను వేగవంతం చేశారు. అకడమిక్‌ బ్లాక్‌కు రూ.31కోట్లు, సీసీ రోడ్లుకు రూ.17కోట్లు, విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాలకు రూ.60కోట్లు, గెస్ట్‌హౌస్‌కు రూ.6.5కోట్లు, కళాశాలలో మౌలిక సదుపాయాలకు రూ.11కోట్లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు రూ.16కోట్లు కేటాయించారు. మొత్తం రూ.135కోట్లతో పనులు ప్రతిపాదించారు. ఇందులో వసతిగృహాల నిర్మాణాలకు అంచనాలు పెరగడంతో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెరిగిన అంచనాలను అమోదించడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. నాలుగు నెలల క్రితం రూ.10కోట్లు నిధులను యూనివర్సిటి అధికారులు మంజూరు చేశారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ నీటిమట్టం మంగళవారం 536.00 అడుగులకు చేరింది. కుడికాలువకు 6,553, ఎడమకాలువకు 7,029 క్యూసెక్కులు విడుదలవుతోంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.9907 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.11600, మోడల్‌ ధర రూ.92000 వరకు పలికింది.

క్రెడిట్‌ చోరీ చేయడంలో చంద్రబాబు, లోకేష్‌ల తర్వాతే ఎవరైనా.. ఇప్పటికే అనేక సంఘటనల్లో ఇది రుజువు కాగా.. తాజాగా జేఎన్‌టీయూఎన్‌ హాస్టళ్ల భవనాల ప్రారంభోత్సవంలోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తుండడం చూపరులను విస్మయానికి గురి చేస్తోంది. వైఎస్సార్‌ సీపీ హయాంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుపుకొని, 80 శాతానికి పైగా పూర్తయిన భవనాలను గత రెండున్నరేళ్లుగా టీడీపీ నేతలు పట్టించుకోకపోగా.. ఇప్పుడు హడావుడిగా అరాకొరగా పనులు నిర్వహించి, అసంపూర్తి భవనాలనే ప్రారంభోత్సవం చేయనుండడంపై అందరూ అవాక్కవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement