నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

నరసరావుపేట: డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.నాగమల్లేశ్వరరావు, జి.తిరుపతిరావు పేర్కొన్నారు. చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కలెక్టర్‌ కార్యాలయం, ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద ఉద్యోగులు 12వ పీఆర్‌సీ ఏర్పాటు చేయాలని, తక్షణమే ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఎంపీడీఓ, ఎన్‌ఆర్‌ఇజీఎస్‌, వీఆర్‌ఓలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం చర్చించి పరిష్కారం చూపించాలని, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమన సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సత్వరమే తమ సమస్యలు

పరిష్కరించాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement