నేడు వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

అచ్చంపేట: మండలంలోని మాదిపాడు పంచాయతీ పరిధిలోని కంచుబోడు గిరిజన తండాలో (పులిచింతల ప్రాజెక్టుకు 6 కిలోమీటర్ల దూరం) దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావు బుధవారం ఆవిష్కరించనున్నారు. వైఎస్సార్‌ విగ్రహ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని వైఎస్సార్‌ అభిమానులు బాణావతు జీవ్లానాయక్‌, బాణావతు చిన్నానాయక్‌లు ఉచితంగా కేటాయించారు. వైఎస్సార్‌ విగ్రహాన్ని కొరివి చిన్న సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య మంగమ్మ, కుమారులు నాగ గోపాలకృష్ణ, వెంకట నరేష్‌, సైదాబాబులు ఇచ్చారు. విస్సార్‌ విగ్రహానికి రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. బుధవారం వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement